2023 లో తెలుగు సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం.!

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నగా మారిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ 2023 లో సినీ పరిశ్రమ అందుకున్న అవార్డులు, రివార్డు ల గురించి తలచుకుంటూ నూతన సంవత్సరంలో సినీ పరిశ్రమ కొత్త టార్గెట్లను సృష్టిస్తూ ముందుకు సాగాలంటూ 2024 కి స్వాగతం పలికారు.

ADVERTISEMENT

గత ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు RRR సినిమాతో రాజమౌళి తెలుగు సినీ ప్రేక్షకుల ఆస్కార్ కళను నాటు నాటు పాటతో నిజం చేశారు. అలాగే ఎన్నోఏళ్ల నుండి తెలుగు సినీ ఇండస్ట్రీకి అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఉత్తమ జాతీయ నటుడు అవార్డుని కూడా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దక్కించుకున్నారు.

అలాగే గోల్డెన్ గోల్బ్ అవార్డుతో RRR మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటే ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించి మెప్పించిన రాంచరణ్ కు పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా నిలిచి అవార్డుని సొంత చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ రోజుజుకి తన పరిధిని విస్తరించుకుంటూ జాతీయ స్థాయి నుండి ఇంటర్ నేషనల్ స్థాయికి చేరుకోవడంలో 2023 ఎన్నో మధుర స్పృతులనే మిగిల్చింది అంటూ మెగా స్టార్ తన సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.

బాహుబలి నుండి విడుదలైన ఒక్కో పెద్ద పాన్ ఇండియా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్లను కొల్లగొడుతుండడం తెలుగు ఇండస్ట్రీ ఎదుగుదలను స్పష్టంగా కళ్ళకు కన్నినట్టుగా చూపిస్తుంది. దీనికి ప్రభాస్ నటించిన సాహో, ఆదిపురుష్,రాధేశ్యామ్ వంటి సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా తోలి రోజు వసూళ్లు సాధించింది. అలాగే పుష్ప,RRR ,యానిమల్, సీతారామం వంటి సినిమాలు కొత్త రికార్డులను సృష్టించాయి. ఈ రకంగా గత ఏడాది సినీ పరిశ్రమకు అత్యంత విలువైనదిగానే భావించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఎలక్షన్స్ క్లోజ్… సినిమా ఓపెన్?

నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…

34 minutes ago

Star Kids vs Outsiders : Fair Fight or Fixed Game?

The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…

50 minutes ago