
‘ఇంకొక్కడు’ ట్రైలర్ నచ్చిందా? అని అభిమానులను ప్రశ్నిస్తూ… చాలా రోజుల తరువాత హైదరాబాద్ లో అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో ‘అకీరన్’ పాత్ర నచ్చిందా? ‘లవ్’ పాత్ర నచ్చిందా? అని అడిగాడు. ‘బాహుబలి’ సినిమాలో చూడడానికి ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుందని, అలాంటి ‘ఐ ఫీస్ట్’ను ‘ఇంకొక్కడు’ సినిమాలో చూడవచ్చని హామీ ఇచ్చాడు.
సినీ ప్రేమికుల కోసం నిజాయితీగా మంచి కథతో, అద్భుతమైన కథనంతో ఓ మంచి ప్రయత్నం చేశామని, తన కెరీర్ లో ఈ సినిమాలో పాత్రలు మైలు రాళ్లుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన విక్రమ్, ఈ సినిమాకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇక, ఈ సినిమా ఆడియో వేడుకకు విచ్చేసిన ‘కంచె’ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, ‘ఇంకొక్కడు’ ట్రైలర్ అద్భుతంగా ఉందని, ‘చియాన్’ విక్రమ్ గారు ఎప్పట్లానే ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు సిద్ధమయ్యారని చెప్పింది.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…