
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 1.29 లక్షల కోట్ల విలువైన 62 ఒప్పందాలు కుదిరాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అందులో రచన సాయి ఇన్ ఫ్రాటెక్ తో 2500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, దీంతో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ తో 5వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, దీంతో 2వేల మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం.
షాపూర్జీ – పల్లోంజీ లతో 6 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇక టాటా పవర్ కంపెనీతో రాష్ట్రానికి 12,500 కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందం కుదిరిందని, దీంతో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ పెట్టుబడులతో 6365 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు.
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…
Actor Rahul Ramakrishna has sparked a fresh debate on social media by calling out the…