Telugu

ఆంక్షల వలయంలో హస్తిన….

నాటి సీజేపీ నీట్ ఉద్యమం తాలూకా పరిణామాలను చూసిన ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుగానే ఎలర్ట్ అవుతున్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థలోని అత్యున్నత పదవులలో ఒకటైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ టార్గెట్ గా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

అందులో భాగంగానే రేపు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా సీజేపీ చేపట్టబోతున్న నిరసన కార్యక్రమాలతో హస్తిన ఆంక్షలు వలయంలో చిక్కుకుంది. సీజేపీ ఇచ్చిన నిరసన పిలుపు తో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని సుమారు 57 మెట్రో స్టేషన్స్ మూతపడ్డాయి.

ADVERTISEMENT

అలాగే జనపథ్ – కర్తవ్య పథ్ కూడలికి నాలుగు కిమీ దూరం నుంచి 24 గంటల పాటు ఇంటర్ నెట్ సదుపాయాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. ఇక ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఇక జంతర్ మంతర్ వద్ద కూడా ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తుకు అధికారులు ముందస్తు వ్యహారచన చేస్తున్నారు. నాటి నీట్ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో ముగిసింది. అలాగే నేటి ఈ ఉద్యమం కూడా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతోనే శాంతిస్తుందా.?

మరోసారి బొద్దింకలు దేశ రాజధాని కమ్మేసేందుకు సిద్దమయ్యారా.? ఎన్డీయే ప్రభుత్వం పై రాజకీయంగా పై చేయి సాధించేందుకు సిద్ధంగా ఉన్నారా.? ఈ పోరులో బొద్దింకలను కట్టడి చేసే శక్తి కాషాయ కమలానికి ఉంటుందా.? ఈసారి కూడా సీజేపీ తన డిమాండ్ ను నెరవేర్చుకున్నట్టయితే ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న బీజేపీ ఒక సోషల్ మీడియా బొద్దింక చేతిలో ఓటమిని ఒప్పుకున్నట్టేగా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Deverakonda Says Enough to AI Misuse!

Vijay Deverakonda has taken the growing misuse of his identity online to court. The actor…

8 minutes ago

Pics: Nikita Sharma Brings Wild Glam In Leopard Print!

Nikita Sharma is making a striking case for leopard print, and the mood is pure…

38 minutes ago