
CJP Returns With Mumbai Protest Plan
భారతదేశ హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ సృష్టించిన సరికొత్త రికార్డు తో మోడీ తన రాజకీయ ఛరిష్మాకు దూరమవుతున్నారా.? దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక, సామజిక, రాజకీయ పరిస్థితులు అన్ని బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా.?
ఇన్నాళ్లు తన రాజకీయంతో ప్రత్యర్థులను రాజకీయ సమాధి చేసిన మోడీ ఇప్పుడు అదే ప్రత్యర్థుల రాజకీయంలో పావుగా మారుతున్నారా.? ప్రజలలో తనకున్న ఛరిష్మాతో ఇన్నాళ్లు దేశ రాజకీయాలలో ఏకచక్రాధిపత్యం వహించిన మోడీ ఇప్పుడు బొద్దింకల చేతిలో కీలుబొమ్మగా మారుతున్నారా.? ఇలా అనేక ప్రశ్నలు కేంద్ర బీజేపీ ని, ప్రధాని నరేంద్ర మోడీని చుట్టుముడుతున్నాయి.
నీట్ పరీక్షా పత్రాల లీకేజ్, ఆ తరువాత జరిగిన పరిణామాలతో దేశంలో బీజేపీ కన్నా పెద్ద పరిమాణంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరు వినిపించింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ కేంద్రంగా నాడు సీజేపీ చేపట్టిన నిరసన దీక్ష చివరికి కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వెళ్ళింది.
దీనితో ఇన్నేళ్ల బీజేపీ ఏకచక్రాధిపత్యానికి బొద్దింకలు బ్రేకులు వేసాయి, బొద్దింకల డిమాండ్ కు బీజేపీ తలలు వంచింది అంటూ బీజేపీ టార్గెట్ గా విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు బీజేపీ ని ఇరుకునపెట్టేందుకు అదే బొద్దింకలు మరోసారి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
మోడీ సర్కార్ తెచ్చిన సర్ విధానం పై ఇప్పటికే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై బీజేపీ పై పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేపీ కూడా తనవంతుగా సర్ పై పోరాడేందుకు తమ కార్యాచరణ ప్రకటించింది. రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ పై మరో ఉద్యమానికి శంఖం పూరించారు కాక్రోచ్లు.
సీఈసీ జ్ఞానేశ కుమార్ రాజీనామా డిమాండ్ తో రేపటి నుంచి ధర్నా స్టార్ అంటూ సీజేపీ ఫౌండర్ అభిజిత్ స్పష్టం చేసారు. అయితే నాడు దేశ రాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ కేంద్రంగా సాగిన సీజేపీ నీట్ ఉద్యమం, ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా మొదలుకాబోతుంది.
ముంబై లో తాము చేపట్టబోతున్న నిరశన దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, తమకు మద్దతుగా గళం విప్పాలని దేశ ప్రజలను కోరిన అభిజిత్ , మా ఈ ఉద్యమం ఒక ప్రణాళిక ప్రకారం సాగుతుందని, మీరు ఎం చేసుకుంటారో చేసుకోండి అంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు సవాల్ విసిరారు.
CEC జ్ఞానేశ కుమార్ ఒక పెద్ద దేశ ద్రోహి అని, ఆయన తక్షణమే తన పదవి రాజీనామా చేయాలనీ, ఆయన రాజీనామా చేసే వరకు తమ ఈ ధర్నా కొనసాగుతోందంటూ ప్రకటించారు అభిజిత్. అయితే నాడు నీట్ వివాదంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కేంద్రం వెనక్కి తగ్గేలా చేసిన సీజేపీ నేడు కూడా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం కేంద్రం మెడలు వంచగలదా.?
Sundeep Kishan's Sigma has generated interest among audiences as it gears up for release on…
There is a class war that is building up in Telangana with chief minister, Revanth…