కూటమి: క్లీన్ గవర్నెన్స్…నీట్ పాలిటిక్స్

అధికారంలో వైసీపీ లేదు…బూతు రాజకీయాలు లేవు, ప్రభుత్వంలో వైసీపీ లేదు వ్యక్తిగత విమర్శలు లేవు, పదవులలో వైసీపీ నేతలు లేరు మహిళల పట్ల నీచ రాజకీయం లేదు..ఇలా గత ఐదేళ్ల వైసీపీ రాజకీయ రిమార్కులను కూటమి ప్రభుత్వం అంచలంచలుగా తుడిచిపెట్టడానికి చూస్తుంది.

అలాగే నాడు జగన్ నియమించిన వాలంటీర్లు లేరు కానీ వ్యవస్థలు నడుస్తున్నాయి, అలాగే జగన్ నిర్ణయించిన మూడు రాజధానులు లేవు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, ఇక నాడు జగన్ చేపట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాలు నేడు లేవు కానీ అనేకమందికి ఉపాధి దొరికింది.

ADVERTISEMENT

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ నిర్దేశించిన చెత్త పన్ను లేదు కానీ పరిసరాలలో పరిశుభ్రత ఉంది, అలాగే జగన్ మాదిరి ప్రభుత్వాన్ని నడపడానికి వందలమంది సలహాదారులు లేరు కానీ పాలనా వ్యవస్థ సవ్యంగా సాగుతుంది.

వైసీపీ హయాంలో మాదిరి రాజకీయ బెదిరింపులు లేవు ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమల స్థాపన జరుగుతుంది తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పట్టాలెక్కింది. వైసీపీ మాదిరి రాజకీయ దాడులు లేవు ప్రతిగా రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యం చిగురు తొడిగింది.

తత్పలితంగా ‘కలం నుంచి కాగితం’ వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రభుత్వం పై విశ్లేషణాత్మకమైన విమర్శలు జరుగుతున్నాయి. ఇలా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ తప్పిదాలను, పాలనాపరమైన పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిద్దిద్దుకుంటూ రాష్ట్రాన్ని గాడిన పెడుతూ రాజకీయాలను శుద్ధి చేస్తున్నారు కూటమి నాయకులు.

అధికార పార్టీల నుంచి సోషల్ మీడియా వేదికగా బూతు రాజకీయాలు నడవడం లేదు, చట్టం ముందు మానవతా విలువల ముందు అధికార పార్టీ క్యాడర్ అయినా తలవంచక తప్పదు అనేలా మాజీ ముఖ్యమంత్రి సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తను బాబు పార్టీ నుండి తొలగించారు, చట్టం ముందు దోషిగా నిలబెట్టి శిక్ష పడేలా చేసారు.

అలాగే మహిళలతో ఆరోపణలు ఎదుర్కున్న పార్టీ నాయకులను సైతం పార్టీ నుండి పక్కకి తొలగించారు. ఇక తానే ఒక వాలంటీర్ గా మారి ప్రతి నెల ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి మరి వారి యోగక్షేమాలను తెలుసుకుని పేదవారికి పెన్షన్ అందిస్తున్నారు ముఖ్యమంత్రి బాబు.

అలాగే పొత్తులో భాగంగా మూడు పార్టీల కలయిక గా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పొత్తు విజ్ఞాలు రాకుండా పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాబు, పవన్. దీనితో కూటమి ప్రభుత్వం క్లీన్ గవర్నెన్స్ తో ముందుకెళుతూ నీట్ పాలిటిక్స్ చేస్తుంది అన్న అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

The Paradise To Chiranjeevi: Srikanth Odela’s Bigger Test

Srikanth Odela’s The Paradise is carrying huge expectations. The Nani starrer is finally locked for…

4 minutes ago

Parasuram’s Next: Big Scale, Big Production House

Director Parasuram Petla is lining up a big-budget film with the producers of HanuMan. As…

35 minutes ago