వైసీపీకి ఇది చెప్పుదెబ్బే… కాదా?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేతనే కూటమి ప్రభుత్వం అట్టహాసంగా పునః ప్రారంభిస్తుండటం, దానిని 5 ఏళ్ళు పాడుబెట్టిన మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పుదెబ్బవంటిదే అని భావించవచ్చు.

ఆహ్వానపత్రికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పేరు ముద్రించకపోవడంపై నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి మరో చెప్పుదెబ్బ కొట్టిన్నట్లు ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డిని కూడా కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది.

ADVERTISEMENT

జగన్‌, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా అమరావతి పేరుతో ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నప్పటికీ, ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి సిఎం చంద్రబాబు నాయుడు ఆనవాయితీని గౌరవించడం అభినందనీయం.

అమరావతి పేరు పలికే అర్హత కూడా కోల్పోయిన జగన్‌ అండ్ కో ఈ సభకు వస్తారని అనుకోలేము. వస్తే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ల ఐక్యతని కళ్ళారా చూసి తట్టుకోవడం కష్టం.

ప్రధాని మోడీ సిఎం చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ని పొగుడుతుంటే చిర్నవ్వుతో విని భరించడం ఇంకా కష్టం. ముఖ్యంగా తాను ధ్వంసం చేసిన అమరావతిని ప్రధాని మోడీ చేతుల మీదుగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తుంటే చూసి తట్టుకోవడం చాలా చాలా కష్టం. కనుక ఈ సభకు జగన్‌ వస్తేనే ఆశ్చర్యపోవాలి.

మే 2న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోడీ ఈసారి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళతో సరిపెట్టకుండా రాష్ట్రంలో రూ.57,962 కోట్లు విలువగల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.

రూ. 3,176 కోట్ల విలువైన పనులకు శంకు స్థాపనలు: 1. నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రం, 2. విశాఖలో రుషికొండ బీచ్ సమీపంలో రూ. 172 కోట్లతో యూనిటీ మాల్‌, 3. గుంతకల్ పశ్చిమ నుంచి మల్లప్ప గేట్ వరకు రైల్వే ప్రాజెక్ట్.

రూ.3,680 కోట్లతో పూర్తిచేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు: 1. కాజీపేట-విజయవాడ జాతీయ రహదారిలో 3వ లైన్, 2. పాణ్యం-కృష్ణమ్మ కొన-బుగ్గనపల్లి సెక్షన్ రైల్వే లైన్.

జగన్‌ 5 ఏళ్ళ విధ్వంస పాలన చూసిన తర్వాత మళ్ళీ ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తేరుకొని గాడిన పడుతుందా?లక్షల కోట్ల అప్పులు తీరేదెలా?అని సామాన్య ప్రజలు సైతం ఆవేదన చెందేవారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు తన తెలివితేటలు, పరపతి, అవకాశాలు అన్నిటినీ పూర్తిస్థాయిలో వినియోగిస్తూ కేవలం 10 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు స్వాంతన కలిగిస్తున్నారు. కనుక ఇదే వేగంతో ముందుకు సాగితే 2029 నాటికల్లా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మళ్ళీ అగ్రస్థానంలో నిలుస్తుంది.

కనుక ఇకనైనా వైసీపీ నేతలు, వారి అధినేత అమరావతిని, దానిని నిర్మిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని చూసి ఏడ్వడం మానుకొని, ప్రజలు మనకి కూడా ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయామే అని ఏడ్వాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

16 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

46 minutes ago