
అంతకు ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పే పరిస్థితి లేదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే. దీనితో వివాదం చెలరేగి రమేష్ దీక్షకు కూర్చున్నారు. కేంద్రం రెండు నెలల్లో ఉక్కు కర్మాగారం నెలకొల్పక పోతే తామే నెలకొలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి ఆయనతో దీక్ష విరమింప చేశారు.
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చెప్పుకుంటుంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం, స్థానిక…
Manjeera water has been a lifeline for Hyderabad, supplying water for cooking and sanitation for…