
YS Jagan Raises Rigging Concerns Ahead of Kadapa Elections
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చెప్పుకుంటుంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలవక మునుపే గెలవలేమని చెప్పేశారు. అప్పటి నుంచి వైసీపీ ఓటమికి రకరకాల సాకులు సిద్ధం చేసుకొని చెపుతూనే ఉన్నారు.
తాజాగా పోలింగ్ రోజున టీడీపి భారీగా రిగ్గింగ్ చేసేందుకు గూండాలను సిద్ధం చేసిందని సరికొత్త వాదనలు వినిపిస్తోంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరగబోతోందని, దానిని పోలీసులు, ఎన్నికల అధికారులు అడ్డుకోవాలంటూ వైసీపీ అభ్యర్ధులు తిరుపతిలో ధర్నా చేశారు.
ఇప్పుడు జగన్ కంచుకోట కడప మున్సిపల్ కార్పోరేషన్లో ఎవరినీ ఓట్లు వేయనీయకుండా అడ్డుకొని, పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకొని టీడీపి రిగ్గింగ్ చేయబోతోందని వైసీపీ సొంత మీడియాలో పెద్ద స్టోరీ అచ్చేసి జనంపైకి వదిలింది.
ఇంత కాలం ప్రజలు తమవైపే ఉన్నారని.. జగన్ అంటే జనం పడి చస్తున్నారన్నట్లు వైసీపీ చెప్పుకునేది. ఇప్పుడు కూడా అలాగే చెప్పుకుంటోంది.
కానీ జనం జగన్ మొహం చూసి వైసీపీకి ఓట్లు వేయకుండా టీడీపీ అడ్డుపడుతోందని, లేకుంటే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి ఉండేదని చెప్పుకుంటున్నారు. అంటే ఓటమికి ముందే సాకులు సిద్ధం చేసి పెట్టుకుంటోందన్న మాట!
ఈ కొత్త స్టోరీకీ ఓ బలమైన కారణం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎక్కడెక్కడ కూటమికి అనుకూలంగా ఏకగ్రీవాలు జరిగితే, అక్కడి వైసీపీ నేతలకు వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ ముందే హెచ్చరించారు.
కానీ జగన్ కంచుకోట పులివెందులలోనే ఏకగ్రీవాలు జరగడం, రేపు కడప మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే అప్పుడు జగన్ చేసిన హెచ్చరిక ఆయనకీ వర్తిస్తుంది కదా?అనే ప్రశ్న వినపడుతోంది.
దీనికి జవాబుగా ‘రిగ్గింగ్ స్టోరీ’ని రెడీ చేసి వదిలినట్లు భావించాల్సి ఉంటుంది. రిగ్గింగ్ జరుగకపోతే వైసీపీ గెలిచి ఉండేదంటూ జగన్‌తో సహా ముఖ్య నేతలందరికీ మినహాయింపు ఇచ్చేందుకు ఈ ‘అమెండ్‌మెంట్’ తప్పలేదు.
ఒకప్పుడు పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం కూడా. ఆర్థిక ఇబ్బందులు,…
సీఎం గా చంద్రబాబు నాయుడు ఫెయిల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు సాగు నీటి నుంచి ప్రజలకు…