Telugu

పరామర్శలకు ‘వైల్డ్’ కౌంటర్..!

పుష్ప అంటే ‘ఫైర్’ కాదు ‘వైల్డ్ ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ పుష్ప సినిమా మీద ఎంత ప్రభావం చూపిందో చెప్పలేం కానీ టాలీవుడ్ మీద, టాలీవుడ్ ప్రముఖుల మాత్రం చాల పెద్ద ప్రభావాన్నే చూపిందని చెప్పొచ్చు.

అలాగే పుష్ప ‘తగ్గేదెలా’ అంటూ బన్నీ రీల్ లైఫ్ లో డైలాగ్ చెపితే సంధ్యా ధియేటర్ ఘటనలో మా ప్రభుత్వం కూడా ‘తగ్గేదెలా’ అంటూ రేవంత్ రియల్ లైఫ్ లో అసెంబ్లీలో ప్రకటన చేసారు. పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా అల్లు vs తెలంగాణ ప్రభుత్వం అంటూ అంటుకున్న మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు.

ADVERTISEMENT

అంతేకాదు ఇప్పుడు ఈ మంట ఒక్క అల్లు ఫామిలీ కే కాకా టాలీవుడ్ మొత్తానికి వ్యాపించేలా ఉంది. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు కాస్త ఆవేశాన్ని తెప్పించినప్పటికీ సాధారణ పౌరులను మాత్రం ఆలోచనలో పడేసింది.

ఒక సెలబ్రెటీ అయినంత మాత్రాన ఒక నిండు ప్రాణం పోయింది, మరో చిన్నారి కొన ఊపిరితో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు అని పోలీస్ అధికారులు చెప్పినప్పటికీ బన్నీ ఆ సమయంలో కూడా తన రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ బయటకు వెళ్లారు. ఆయన నిర్లక్ష్యానికి ఒక కుటుంబం తల్లిని కోల్పోయి, బిడ్డకు దూరమై మానసిక వేదన అనుభవిస్తున్నారు.

ఆ కుటుంబం కార్చిన కన్నీటికి న్యాయం చెయ్యడం తప్పా.? అల్లు అర్జున్ కు ఏమైనా కాళ్ళు విరిగాయా, చేతులు విరిగాయా.? లేక కిడ్నీలు పోయాయా.? తన నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఒక్క రోజు జైలు కు వెళ్లొచ్చిన బన్నీని చూడడానికి, ఆయన్ను మద్దతు తెలపడానికి ఆయనను పరామర్శించాహడానికి బన్నీ ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు ఎవరైనా కనీసం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారా.?

మరి ఈ సినీ ప్రముఖుల ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించండి. వారికి సామాన్యుల ప్రాణాల మీద కనీస మానవత్వం ఉండదా.? సంధ్యా ధియేటర్ ఘటన కు బన్నీ అరెస్టుకు మధ్య దాదాపు వారం రోజుల సమయం ఉన్నప్పటికీ పుష్ప సినిమా తరుపున ఆ చిత్ర నిర్మాతలు కానీ, హీరో కుటుంబం కానీ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారా.? మరి ఆ సామాన్యుడికి దక్కని పరామర్శ ఈ సెలబ్రేటీకి ఎందుకు.?

పోలీస్ అధికారులు ధియేటర్ కు వద్దని వారించినా వచ్చిన హీరో తప్పుని సమర్థిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతలు తమ స్వలాభం కోసం సినీ ప్రముఖుల అరెస్టు వ్యతిరేకిస్తూ నా పై విమర్శలు చేస్తున్నారు.

ఉద్యమాలు చేసి రాజకీయాలలోకి వచ్చాం అని చెప్పుకుంటున్న ఈ మాజీ మంత్రులు వారి ఉద్యమాల సమయంలో సినీ ఇండస్ట్రీని కనీసం షూటింగ్ లు కూడా చేయనివ్వకుండా వేధించలేదా.? అంటూ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కౌంటర్ వ్యాఖ్యలు రేవంత్.

నేడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో బన్నీ అరెస్టు విషయంలో ప్రభుత్వానికి, అల్లు ఫామిలీ కి మధ్య ఏవో అపోహలు అంటూ వస్తున్న ఊహాగానాలు పూర్తిగా తొలగినట్టే. బన్నీ అరెస్టు రాజకీయ అరెస్టు కాదని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య పూరిత రాజకీయం చేయలేదని ముఖ్యంమత్రిగా రేవంత్ ప్రజలతో పాటు సెలబ్రెటీలకు విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ వివరణతో పుష్ప ఫైర్ అవుతుందా.? ఫ్లవర్ అవుతుందా.? అనేది వేచి చూడాలి. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం తగ్గేదెలా అంటూ దూకుడుగా ముందుకు వెళ్లబోతున్నాడు అనేది సుస్పష్టమయ్యింది. మరి సినీ ప్రముఖులు కూడా బన్నీకి అంతే దూకుడుగా మద్దతు తెలుపుతారా.? లేక ఇక మౌనమే మా పరామర్శ అంటూ నిశబ్దాన్ని ఎంచుకుంటారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Actress Divya Bharathi Dating IPL Star? Real or Rumors?

Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…

19 minutes ago

OTT Shocker: Theatrical Disaster Wins Great Reviews

Amit Rai’s Ohh My Dog appears to be getting a fresh lease of life on…

49 minutes ago