
నేటి రాజకీయాలలో బెదిరింపుల పర్వం నిర్విరీరంగా కొనసాగుతూనే వస్తుంది. ఇందుకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా పోతుంది. గతంలో అధికార ఉన్న పార్టీలు, ప్రత్యర్థి పార్టీలను భయపెడితే నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు అధికార పార్టీ నాయకుల మీద బెదిరింపులకు దిగుతున్నారు.
ముఖ్యంగా గౌరవప్రద రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్న నేతలను సైతం వదలకుండా వారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మొన్న ఏపీలో, నిన్న తెలంగాణలో నేడు తమిళనాడులో ఇటువంటి బెదిరింపు రాజకీయాలు బయటపడ్డాయి.
తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ ను ఉద్దేశించి అక్కడి ప్రతిపక్ష పార్టీ డీఎంకే విలాత్తికుళం ఎమ్మెల్యే జి.వి మార్కండేయన్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. కోవిల్ పట్టిలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ప్రసంగించిన మార్కండేయన్ విజయ్ ‘నీ ఎముకలు విరగొడతా’ అంటూ సీఎం విజయ్ పై బెదిరింపు వ్యాఖ్యలు చేసారు.
దీనితో అతని పై చర్యలు తీసుకునేందుకు చట్టం తన పని తానూ చెయ్యాల్సి వచ్చింది. విజయ్ ఎముకలు విరగొడతా అంటూ బహిరంగంగా సీఎం ని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో సదరు డీఎంకే ఎమ్మెల్యే ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఏకంగా ముఖ్యమంత్రి స్తానం లో ఉన్న వ్యక్తి పైనే ఇలా బెదిరింపులకు పాలడైతే ఇక సామాన్య ప్రజానీకం సంగతేంటి అంటూ ప్రజాస్వామ్య వాదులు వాదిస్తున్నారు. మొన్న ఏపీలో సీఎం బాబు ని ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఇదే తరహాలో బాబు పై నడిరోడ్డు మీద లకరాలతో విరుచుకుపడ్డారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ పై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. అయితే రాజకీయాలలో ఇటువంటి విష సంస్కృతికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటుగా అధికారుల మీద కూడా ఉంటుంది.
అధికార పార్టీ నేతల టార్గెట్ గా రాజకీయ విమర్శలు చేయడం, వారి ప్రభుత్వ పని తీరు మీద వేలెత్తి చూపడం, ప్రజల సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం తప్పు కాదు. కానీ రాజకీయాలు అనే ముసుగు వేసుకుని ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం ఖచ్చితంగా చట్ట విరుద్ధం.
ఇటువంటి చర్యలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం రాజకీయాలకు అత్యవసరం. ఈ తరహా నీచ రాజకీయాలకు ఎక్కడో అక్కడ చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఆ పార్టీ అధినేతకు ఉండాలి.
Car gifts after a hit have almost become a familiar part of South Indian cinema…
Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…