
భారత రాజకీయాల్లో ఇప్పటివరకు ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చినప్పటికీ ఒక ‘బొద్దింక’ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడం, అందునా ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకోవడం భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయమనే చెప్పాలి.
అయితే అలా సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోనే ఒక సంచనలం సృష్టించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానూ ఎత్తుకున్న మొదటి ఉద్యమంలోనే అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న మరో నూతన చరిత్ర సృష్టించింది.
‘నీట్’ ఉద్యమంతో దేశంలోని యువత అందరిని ఒకే తాటిపై తెచ్చి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఉద్యమాలు సాగించింది. దాని ఫలితం ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ‘ధర్మేంద్ర ప్రధాన్’ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
దీనితో ఎన్డీయే ప్రభుత్వంపై, ముఖ్యంగా బీజేపీపై తన మొదటి రాజకీయ విజయాన్ని నమోదు చేసిన సీజేపీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రధాన కమిషనర్ ‘జ్ఞానేశ్ కుమార్’ రాజీనామా డిమాండ్ తో మరో ఉద్యమానికి పిలుపునిచ్చారు.
అయితే నీట్ ఉద్యమం మాదిరి సర్ ఉద్యమంతో సీజేపీ అనుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయింది. నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఎన్డీయే ప్రభుత్వం మీద పైచేయి సాధించిన సీజేపీ సర్ ఉద్యమంలో చతికిలబడిందనే విమర్శలు ఎదుర్కొంది.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అంటూ కేంద్ర ప్రభుత్వానికి ‘డెడ్ లైన్’ విధించిన సీజేపీ చివరికి ‘లేఆఫ్’ తో సరిపెట్టుకుందా? అంటూ సోషల్ మీడియాలో కాక్రోచ్ పార్టీ పై సెటైర్లు పేలుతున్నాయి. తొలి ఉద్యమంతో చరిత్ర సృష్టించిన సీజేపీ ఇప్పుడు తెరవెనక్కి వెళ్లిందా?
The anticipation surrounding SS Rajamouli's Varanasi, starring Mahesh Babu, continues to grow. The film is…
Tamil Cinema is arriving at a point where almost all of its elite superstars are…