
సోషల్ మీడియా యుగంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఒక రాజకీయ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు దశాబ్దాల సమయం పట్టేది. కానీ నేటి సోషల్ మీడియా జమానాలో అటువంటి పరిస్థితి లేదు. ఒక వైరల్ కంటెంట్ పోస్ట్, మీమ్స్, రీల్స్ వంటి డిజిటల్ ప్రచారం ద్వారా కొద్దీ రోజులలోనే, కొన్ని సందర్భాలలో అయితే కొన్ని గంటల వ్యవధిలోనే సమాచారం లక్షలాదిమందికి చేరుతుంది.
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా అలాంటి వైరల్ డిజిటల్ ఫెనామెనాగా చర్చకు వచ్చింది. కేవలం వారం రోజులలోనే ఇన్ స్టా లో 22 మిలియన్ల ఫాలోవర్స్ తో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఇన్ స్టా ఖాతాల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాధించుకుంది.
అలాగే నాలుగు రోజులలోనే అధికార బీజేపీ ఇన్ స్టా ఖాతా ఫాలోవర్స్ సంఖ్యను అధిగమించింది. దీనితో కాక్రోచ్ జనతా పార్టీ పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత సీజేపీ ముఖ్య ఫాలోవర్స్ గా మారారు. ఇలా పుట్టుకతోనే పలు అరుదైన రికార్డులు సృష్టించిన సీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో మరొకొన్ని మార్పుల కోసం నడుంబిగించింది.
అలా సీజేపీ పేరుతో సోషల్ మీడియాలో పుట్టిన విప్లవం నేడు దేశ రాజధాని ఢిల్లీని ఊపేస్తోంది. ఎవ్వరు ఊహించని విధంగా ఒక బొద్దింక రూపంలో భారతదేశ రాజకీయాలలోకి అడుగుపెట్టిన సీజేపీ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి తలనొప్పిగా తయారయ్యింది.
నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ కారణంగా అనేకమంది విద్యార్థులు మానసిక క్షోభకు లోనయ్యారని, ఇంకా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని….దీనికి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలంటూ సీజేపీ ఢిల్లీ కేంద్రంగా నిరశన కార్యక్రమం చేపట్టింది.
తాము ఏ రాజకీయ పార్టీ కి మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ ఈ కార్యక్రమాలు చేయడం లేదని, కేవలం విద్యార్థుల భవిష్యత్ కోసమే అంటూ ఢిల్లీ లో సంసద్ మార్చ్ పేరుతో నిరశన ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తున్న సీజేపీ శ్రేణులను అనుమతి లేదంటూ అడ్డుకుంటూ పోలీసులు వారి పై లాఠీ ఛార్జ్ చేసారు.
దీనితో ఢిల్లీ వీధులలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత మూడు తఫాలుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారం దక్కించుకున్న బీజేపీ పై ఈ రకమైన రాజీనామా ఒత్తిడులు తెచ్చిన పార్టీగా సోషల్ మీడియాలో పుట్టిన ‘సీజేపీ’ నిలవడం తో సీజేపీ చాపకింద నీరులా దేశ రాజకీయాలలోకి చొరబడింది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
మరి సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఈ సీజేపీ దేశ రాజకీయాలను ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న బీజేపీ ని శాసించగలుతుందా.? ప్రజల మద్దతు సాధించగలుగుతుందా.? బీజేపీ కి ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థి లేదు అనే అభిప్రాయాన్ని సీజేపీ తన రాజకీయంతో బద్దలుకొట్టగలుగుతుందా.? ఆ దిశగా దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేయగలుగుతుందా.? అనేది రానున్న రోజులలో తేలనుంది.
YouTuber Nandana has reportedly appeared before the police in connection with the financial fraud case…
Suriya and Jyothika have completed 20 years of marriage. Instead of just celebrating a wedding…