
కొత్త హీరోలను హీరోయిన్లను లాంచ్ చేయడంలో పూరీ సిద్ధహస్తుడని చెప్పిన ఆలీ, అలాగే ఇషాన్ కూడా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారని, ఇక హీరోయిన్ విషయంలో సమస్యే లేదు… చూసారుగా పాట..! ‘దేవదాసు’ సినిమా తర్వాత ఇలియానాకు ఒక 10 శాతం పేరొస్తే… ‘పోకిరి’ తర్వాత 100 శాతం పేరొచ్చేసింది. ఎందుకంటే… ఆ అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనేది చక్కగా కెమెరా ముందు పెట్టి… అద్భుతంగా, అమోఘంగా, ఆప్యాయతతో, అనురాగంతో… అంటూ ఒక విధమైన రీతిలో అలీ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల చేత అరిపించాయి.
‘గల గల పారుతున్న గోదారిలా… అంటూ కెమెరా పక్కనుండి వెళ్తుంటే… ఎందుకురా పెళ్లి చేసుకున్నాను అనిపించింది, ఆ తర్వాత ఆ అమ్మాయి మంచి స్థాయికి వెళ్ళింది, పెద్ద పెద్ద హీరోలతో చేసింది, అలాగే రక్షిత, ఆసిన్ వంటి హీరోయిన్లు కూడా మంచి స్థాయికి వెళ్ళిన వారి జాబితాలో ఉన్నారని చెప్తూ ఆడియో వేడుకపై అలీ మార్క్ వినోదాన్ని అందించారు. ఓ పక్కన మైక్ పట్టుకుని మాట్లాడుతూ మరో పక్కన చేతితో అలీ ఇచ్చిన కదలికల ఆంతర్యం సినీ విజ్ఞులకు ఇట్టే అర్ధమవుతుంది.
గతంలో ఇంత కంటే దారుణంగా మాట్లాడిన సందర్భాలలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో, ఇటీవల కాలంలో అసలు ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. బహుశా “రోగ్” సినిమాలో వీడియో సాంగ్స్ చూసిన ఉత్సాహమో ఏమో గానీ, చాలా కాలం తర్వాత హీరోయిన్లపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. బీచ్ సాంగ్ లతో వీక్షకులను మైమరిపించే పూరీ, ఈ సినిమాలోని బీచ్ సాంగ్ ను హీరోయిన్ ఏంజెలా అందాలతో కన్నుల పండుగగా మార్చేసారు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…