Telugu

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టాలీవుడ్ కమెడియన్!

అలనాడు తెలుగు వెండితెరపై నవ్వులు పండించిన కమెడియన్లలో బాబూమోహన్ ఒకరు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు – బాబూమోహన్ ల జోడి సినిమాలో ఉందంటే… అది సూపర్ హిట్టు క్రిందే లెక్క పెట్టేవారు. అంతలా వారిద్దరూ తమదైన శైలిలో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేవారు. అయితే ఇద్దరి వ్యక్తిగత జీవితాలలో ఒక రకమైన సంఘటనలు చోటు చేసుకోవడం అనేది దైవ సంకల్పమా? కాకతాళీయంగా జరిగిందో గానీ… ఆ విషాదం తనను ఆత్మహత్య వైపుకు ప్రోత్సహించేలా చేసిందని తాజాగా ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో బాబూమోహన్ స్పష్టం చేసారు.

ADVERTISEMENT

“నా పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత ఆ బాధ భరించ లేకపోయానని, ఆ సమయంలో ఇక ఏమీ పాలుపోక నిర్జీవ స్థితిలో ఉన్న తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని” ఈ నవ్వుల రారాజు ఆవేదన చెందుతూ చెప్పుకొచ్చారు. మా పెద్దబ్బాయి చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడినే కాదు, మూడు నెలల పాటు నేనున్న గది తలుపులు కూడా వేసే ఉండేవి… ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడిని… ఇంట్లో ఎవరి గదిలో వారు అదే విధంగా ఉండేవారు. లైట్లు కూడా వెలిగించే వాళ్లం కాదు. ఆల్మోస్ట్ చీకట్లో ఉన్నట్లే ఉండేవాళ్లం.

ఒక రోజు ఎందుకో ఇంట్లో నుంచి బయటకు వస్తే, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారు నన్ను పిలిచారు. ఎంతో యాక్టివ్ గా ఉండే నన్ను అలా చూసి బాగా ఫీలయ్యారు. ‘ఎవడిగోల వాడిది’ షూటింగ్ ఉంది, బ్యాంకాక్ వెళ్లిపోదాం, రెండు నెలలు ఉండొద్దాం అని తీసుకువెళ్లారు. అలా ఎంత మరిచిపోలేని విషయాలనైనా, గుంపులో పడితే మార్పు వస్తుందని తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగాను, ఇక చాలులే, తొందరగా చచ్చిపోతే, నా కొడుకు దగ్గరకు వెళ్లిపోవచ్చు, వాడితో ఆడుకోవచ్చు అని అనుకున్న స్థాయి నుండి ఎంతో మందికి సాయం చేశాను, నేను ఎందుకు చనిపోవాలన్న ఆలోచనకు వచ్చానని తన విషాద ఘటను గుర్తు చేసుకున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Nimrit Kaur Flaunts Sultry Grace In Blue Saree

Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…

20 minutes ago

Romanchakam Review: Thin Story, Patchy Laughs

BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…

40 minutes ago