Telugu

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ’ని ఇంకా తొక్కుతున్నారా?

సినిమా ఇండస్ట్రీలో ‘ప్లాస్టిక్ నవ్వులు, గ్లిజరిన్ కన్నీళ్లు’ అనే మాటలు చాలా విరివిగా వినపడుతుంటాయి. మరో రకంగా చెప్పాలంటే… బయటకు కనపడేది ఒకటి… లోన ఉండేది మరొకటి… ఇది సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో ఎక్కువ మంది అవలంభించే సూత్రం అంటుంటారు. చాలా సందర్భాలలో ఇది రుజువైంది కూడా! అలాంటి ఉదంతాలకు సినిమా ఇండస్ట్రీ నిలయమేనంటూ తాజాగా ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ’ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT

సినిమాలో నటించడానికి వచ్చిన పృధ్వీని మేకప్ రూమ్ లోనే కూర్చోబెట్టి, ఆ పాత్రను మరొక వ్యక్తితో చేయించడం… అనేది ఇప్పుడు పృధ్వీ నవ్వుతూ చెప్తున్నా… నాడు ఒక నటుడుని కనీస సంస్కారం కూడా లేకుండా ఎలా అవమానించారో అన్నది స్పష్టమవుతుంది. ఈ ఘటనలో నిర్మాత ఏమో పృధ్వీని పెట్టమన్నాను కదా అని అడిగితే… లేదండి దర్శకుడు మరొక ఆర్టిస్ట్ ను పెట్టమన్నారు అంటే… ముఖానికి వేసుకున్న మేకప్ తుడుచుకుని వెళ్ళిపోయాను… అని చాలా సింపుల్ గా పృధ్వీ చెప్పాడు. అంతేకాదు, వేసుకున్న మేకప్ లు తుడుచుకుని వెళ్ళిపోయిన రోజులకు కొదవలేదని చెప్పిన పృధ్వీ మాటలు… సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఏ రకంగా వస్తాయో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అక్కడ నుండి ఎన్నో అష్టకష్టాలు పడి, ప్రస్తుతం ఒక స్థాయికి వచ్చిన పృధ్వీని ఇప్పటికీ తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే… సినీ జనాల ‘నీతి బుద్ధులు’ ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు. చిరంజీవి 150వ సినిమా నుండి, బాలకృష్ణ 100వ సినిమా నుండి పృధ్వీ నటించకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయన్నది నిజమేనని, వారి పేర్లు ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను… అని చెప్పిన పృధ్వీ, వీరిద్దరి సినిమాలలో నూటికి నూరు శాతం కనిపిస్తానని చెప్పాడు. అయితే ఇంతగా ఎదిగిన తర్వాత కూడా ఇంకా తొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే… ఇండస్ట్రీలో ఎంత కలుషితమైన జనాలు ఉన్నారో అవగతం చేసుకోవచ్చు.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్న ఓ యువహీరోకు తనంటే ఎంతో ఇష్టమని, అతనితో మాట్లాడుతున్నపుడు, పక్కన ఉన్న వారు తానూ వెళ్లిపోవాలి అన్నట్లుగా ‘సైగలు’ చేస్తుంటారని, తానూ ఎక్కడ దగ్గర అయిపోతానో అనే ఆందోళన వారిలో ఉంటుందని, సినీ ఇండస్ట్రీలో భజనపరులకు కొదవలేదని అన్నారు. అయితే తనవరకు ఏదైనా హృదయపూర్వక సమాధానమే వస్తుంది తప్ప, లోన ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తి కాదని, ఏదైనా ఉంటే ప్రత్యక్షంగానే చెప్పేస్తానని చెప్పుకొచ్చారు.

క్రింది స్థాయి నుండి ఎదిగిన పృధ్వీ త్వరలో హీరో కూడా కాబోతున్నారన్న వార్తను అందించారు. ఇందుకోసం ఈ వయసులో కూడా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే… సినిమా పట్ల పృధ్వీ నిబద్ధత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా సత్తిబాబు దర్శకత్వంలో సలోని హీరోగా ఓ సినిమాలో నటించనున్న పృధ్వీ, తదుపరి తన స్నేహితుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తానని, దానికి ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అని టైటిల్ ను కూడా అనుకున్నామని అన్నారు.

నిజానికి సినీ వారసుల కంటే కూడా ఇలాంటి వారు విజయాలు సాధించినపుడే ఇండస్ట్రీ ఎదుగుతుంది, విజయం అనే పదానికి కూడా గర్వకారణంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడానికి పృధ్వీ పడిన కష్టాల గురించి ఇండస్ట్రీలో తోటి కమెడియన్లు కధలుకధలుగా చెప్పుకుంటుంటారు. అలాంటి పృధ్వీ హీరోగా నటిస్తున్న సినిమాలు కూడా విజయవంతం కావాలని, అలాగే కమెడియన్ గా మరిన్ని మంచి పాత్రలలో నటిస్తూ, తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచెత్తుతాడని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

8 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

9 hours ago