
‘పవన్ కళ్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని, తను ఏం చేసినా, ఏం చెప్పినా చాలా నిజాయితీగా చెప్తారని, అందుకే పవన్ తనకు అభిమానం ఎక్కువని’ అభిప్రాయపడ్డారు సునీల్. అయితే 2019 ఎన్నికలలో పవన్ ఎన్నికల బరిలోకి దిగమని చెప్తే… ‘జనసేన’ తరపున ప్రచారం చేయడానికి తానూ వెనుకాడనని, అయితే పోటీ మాత్రం చేయనని చెప్పుకొచ్చారు ఈ ‘అందాల రాముడు.’
పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బాధ్యత అప్పజెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటాను గానీ, పోటీ మాత్రం తన వల్ల కాదని, ఆ సమయం ఏదో తనకు వచ్చిన పని మీద పెడితే మంచిదన్న ఉద్దేశమే తప్ప ఇంకేమి లేదని ‘జనసేన’పై తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పుకొచ్చారు. సునీల్ కు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు అయిన త్రివిక్రమ్, మరో పక్క పవన్ కు కూడా అదే రకంగా శ్రేయోభిలాషిగా ఉన్న విషయం తెలిసిందే. బహుశా ‘జనసేన’ తరపున సునీల్ కు ఏదైనా బాధ్యత వస్తే… అది పవన్ సలహా మేరకు త్రివిక్రమ్ డైరక్షన్లోనే అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…