
ఎవరైనా ఒక నిర్మాత వచ్చి సినిమా హీరోగా మీకు అవకాశం ఇచ్చిన తర్వాత… ఒక్కసారి అద్దం ముందు నిల్చుని హీరోగా నేను పనికి వస్తానా అని ఎప్పుడైనా అనుకున్నారా? అన్న ప్రశ్నకు స్పందించిన సునీల్, ‘నాకేం తక్కువైంది ఇప్పుడు? రజనీకాంత్ ఎలా ఉంటారు? అయినా మీరు ఏదో ఫిక్స్ అయ్యి వచ్చినట్లున్నారు… అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ‘చంపేస్తా మిమ్మల్ని… కరెక్ట్ గా మాట్లాడండి…’ అంటూ ఒక రకమైన వార్నింగ్ ని ఇచ్చారు. నిజానికి అంతకు ముందే ఒకటికి రెండు సార్లు, ఇదే రకమైన ప్రశ్నను పరోక్షంగా సదరు మీడియా ప్రతినిధి అడిగి ఉన్నాడు.
కమెడియన్ గా వచ్చిన అవకాశాలు హీరోగా ఎందుకు రావట్లేదు అని అడగగా, నాకు హీరో ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి, వాటినే నేను పోషిస్తున్నాను, ఒక రకంగా చాలా సినిమాలను డేట్స్ ఖాళీ లేక నేనే ఒప్పుకోవట్లేదు అని తన హీరో ఆఫర్లను వివరించే ప్రయత్నం చేసాడు ఈ ‘భీమవరం బుల్లోడు.’ సినిమాకు కలెక్షన్స్ ఒక్కటే ప్రామాణికం అన్న సునీల్, తాను హీరోగా నటించిన 8 సినిమాలలో 6 హిట్లు, ఒకటి యావరేజ్, ఒకటి ఫ్లాప్… తను హీరోగా ఎందుకు ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? అని కాస్త కటువుగానే రియాక్ట్ అయ్యాడు. ఒక రెండు ఫెయిల్యూర్స్ వస్తే వాటినే పట్టుకుంటారా? అని ప్రశ్నించాడు.
మీరు ఏదో పెట్టుకుని కావాలని ఇరిటేట్ చేస్తున్నారు… మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా..? లేక ఏదొకటి బయటపెట్టేద్దామని భావించి వచ్చారా..? అంటూ ఒకానొక సందర్భంలో కూడా సదరు మీడియా ప్రతినిధిని కూడా ప్రశ్నించాడు సునీల్. సహజంగా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి గానీ, ఈ కార్యక్రమంలో వేసే ప్రశ్నలు, అడుగుతున్న విధానం, చెప్తున్న సమాధానాలు… ఎప్పుడూ హాట్ టాపిక్ కావడం విశేషం.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…