Telugu

పెద్ద సినిమాల కరువుతో తెలుగు బాక్సాఫీస్

అతివృష్టి అనావృష్టి సామెతను అక్షరాలా పాటించడంలో టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ ముందుంటారు. ఒక ప్లానింగ్ తో వీలైనంత క్లాష్ లేకుండా చూసుకోవడం ఏ కోశానా అమలు జరగడం లేదు. పరిస్థితి ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు పెద్ద సినిమాలు కేవలం ఇరవై నాలుగు గంటల గ్యాప్ తో రిలీజయ్యేంత. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి హిట్టయ్యాయి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అమిగోస్ తో కలుపుకుని మైత్రి సిచువేషన్ ఇంకోలా ఉండేది. ఆ మధ్య దసరాకు గాడ్ ఫాదర్, ఘోస్ట్ ల మధ్య రావడం వల్లే స్వాతిముత్యం నష్టపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఈ వారంతో మొదలు మొత్తం మూడు ఫ్రైడేలు మూవీ లవర్స్ పాలిట డ్రై డేస్ గా మారబోతున్నాయి. గట్టిగా చెప్పుకునే రిలీజులు ఏమీ లేవు. కోనసీమ థగ్స్ అని ఓ తమిళ డబ్బింగ్ ని మైత్రి పంపిణి చేస్తోంది. ఒక్క బాబీ సింహా తప్ప మనకు తెలిసిన మొహాలు పెద్దగా లేవు. ప్రమోషన్లు కూడా సోసోనే. ఆఖరి నిమిషంలో వాయిదా పడినా ఆశ్చర్యం లేదు. సీనియర్ నృత్య దర్శకురాలు బృంద డైరెక్షన్ డెబ్యూ ఇది. మిస్టర్ కింగ్ అనే మరో చిత్రం సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది కానీ దీనికీ సౌండ్ అంతంత మాత్రమే. ఓపెనింగ్స్ ఆశించలేం.

ADVERTISEMENT

ఆపై వారం చూస్తే దిల్ రాజు కమెడియన్ శీనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన బలగంకి ముందుగానే ప్రీమియర్లు వేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 3 ఇంకా టైం ఉన్నపటికీ హైప్ పెంచడం కోసం రైటర్ పద్మభూషణ్, సార్ వాడిన ఫార్ములాని ఉపయోగిస్తున్నారు. ఇది కాకుండా ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, గీతసాక్షిగా ఉన్నాయి కానీ కనీస స్థాయిలో ప్రమోషన్లు లేవు. తిరిగి మార్చి 10న కూడా బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ వస్తోంది కానీ దాని మీద సైతం అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ప్రొడ్యూసర్ల మధ్య సయోధ్య లేక వచ్చిన తిప్పలివి. ఒకవేళ సార్, వినరో భాగ్యము విష్ణు కథలో ఒకరు వెనక్కు తగ్గి ఒక వారం ఆలస్యంగా వచ్చి ఉంటే వసూళ్ల పరంగా ఇంకాస్త ఎక్కువ ప్రయోజనం కలిగేది. కానీ శివరాత్రిని టార్గెట్ చేసుకోవడం వల్ల కేవలం ఒక్క రోజు గ్యాప్ తో ఢీ కొట్టుకున్నారు. దీని వల్ల నష్టపోయింది కిరణ్ అబ్బవరం సినిమానే అనేది కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. ఫిబ్రవరి మార్చి నెలలు మరీ డ్రైగా భావించాల్సిన అవసరం లేదు. గతంలో నేను లోకల్, రంగస్థలం లాంటి హిట్లు ఈ నెలల్లో వచ్చినవే. ఏది ఏమైనా ఓ పదిహేను రోజులు మూవీ లవర్స్ కి డ్రై డేస్ తప్పవు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Needs Venky Atluri, But Why?

Vijay Devarakonda had a new release in the form of Ranabaali yesterday. The film opened…

2 minutes ago

రేవంత్‌ని విమర్శించాలంటే చంద్రబాబుని పొగడాల్సిందే… తప్పదు!

అవును. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్న నోటితోనే ఇప్పుడు హరీష్‌ రావు పొగడక తప్పడం లేదు. అయితే చంద్రబాబు…

10 minutes ago