Telugu

రేవంత్‌ని విమర్శించాలంటే చంద్రబాబుని పొగడాల్సిందే… తప్పదు!

అవును. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్న నోటితోనే ఇప్పుడు హరీష్‌ రావు పొగడక తప్పడం లేదు. అయితే చంద్రబాబు నాయుడుపై ప్రేమ, గౌరవంతో కాదు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధుడు, ముందు చూపు లేనివాడని విమర్శించేందుకు చంద్రబాబును పొగడాల్సి వస్తోంది. అంటే పెద్దగీతను చిన్నది చేయాలంటే పక్కన మరో పెద్ద గీత గీసినట్లు అన్నమాట !

హరీష్‌ ఏమన్నారంటే, “కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీ పాలకులకు కృష్ణ, గోదావరి నీళ్ళ గురించి అడిగే ధైర్యం చేయలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక యధేచ్చగా నీళ్ళు తీసుకుపోతున్నారు.

ADVERTISEMENT

రేవంత్‌ రెడ్డి అసమర్ధుడు, ముందుచూపు లేనివాడు కావడం వలననే దిగువకు నీళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. వాటిని ఏపీ సిఎం చంద్రబాబు నల్లమల్ల సాగర్‌ జలాశయంలో ఒడిసి పట్టి, తెలివిగా కుప్పం వరకు పారించుకుంటున్నారు.

దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి. మేము గట్టిగా నిలదీసిన తర్వాత మూడు మోటార్లు మాత్రమే ఆన్‌ చేశారు. అన్నీ ఆన్‌ చేసి నీళ్ళు ఎత్తిపోసి ఉండి ఉంటే నేడు వరంగల్‌ జిల్లాలో కరువు ఏర్పడేదే కాదు కదా?

ఇక్కడ నీళ్ళు, ఎత్తిపోసేందుకు మోటార్లు, నింపుకునేందుకు జలాశయాలు అన్నీ సిద్ధంగా ఉన్నా, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు.

వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడిచిపెట్టేస్తుంటే, అక్కడ చంద్రబాబు నాయుడు ప్రతీ నీటి బొట్టుని ఒడిసిపట్టి రాయలసీమ జిల్లాలను కరువు నుంచి కాపాడుకున్నారు. సీమ ప్రాంత ప్రజలు ఎక్కడికక్కడ జలహారతులు ఇచ్చి సంతోషంగా ఆ నీటిని వాడుకుంటున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను, నీటిని వాడుకోకుండా రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తోంది.

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయక ఇప్పుడు నీటిని పొదుపుగా వాడుకోమని రేవంత్‌ రెడ్డి రైతులకు లెక్చర్లు ఇస్తున్నారు. నిజానికి ఇది ఎల్‌నినో వలన ఏర్పడిన కరువు కాదు. ఇది అయన స్వయంగా సృష్టించిన కరువే,” అని హరీష్‌ విమర్శించారు.

హరీష్‌ చేస్తున్న ఈ విమర్శలకు సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు నేటికీ సంతృప్తికరమైన జవాబు చెప్పడం లేదు. కనుక నీళ్ళ కరువు, కరెంట్ కోతలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలు హరీష్‌ చేస్తున్న ఈ విమర్శలు, వాదనలతో కనెక్ట్ అవుతారు. దాని వలన కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే ఎన్నికలలో దీనికి మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

అయితే చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో భ్రష్టు పట్టిపోతోందని వైసీపీ వాదిస్తున్నప్పుడు, దాంతో అంటకాగుతున్న బీఆర్ఎస్‌ పార్టీ, చంద్రబాబు నాయుడుని ఈవిధంగా పొగిడేస్తుంటే, ఏపీలో అభివృద్ధి జరుగుతోందనే వాస్తవం చెప్పేస్తుంటే వైసీపీ పరిస్థితి ఏమిటి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Garividi Lakshmi Review: Uneven And Lags, But Ends Well

BOTTOM LINE Uneven And Lags, But Ends Well RATING 2.25/5 Story, Screenplay, Director: Gowri Naidu…

11 minutes ago

Big Fat South Wedding: How Many CMs Attending?

One of the high-profile weddings in South India is going to happen on November 21,…

26 minutes ago