
బుల్లితెరపై ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంచు లక్ష్మి, తాజాగా ‘కుందనపు బొమ్మ’ సమంతను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసింది. ఆ కార్యక్రమం తాజాగా ప్రసారం కాగా, తెలుగులో గలగలమంటూ మాట్లాడుతున్న సమంతను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… ‘నాకు, తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదని, నా కంటే నువ్వే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు’ అని చెప్పింది. అయితే లక్ష్మి కామెంట్స్ కు చిరునవ్వు నవ్విన సమంత… తనకూ సరిగా రాదని, కష్టపడి మాట్లాడుతున్నానని, ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరింది.
అయితే తెలుగు భాషపై తనకున్న పరిజ్ఞానం గురించి మంచు లక్ష్మికి బాగానే అవగాహన ఉన్నట్లుంది. ఇప్పటివరకు ఇతరులు చేసినవి కేవలం విమర్శలు కాదు, అవి నిజాలు అని చెప్పే రీతిలో తన తెలుగు భాషా ప్రావీణ్యం ఉందని మంచు లక్ష్మి చెప్పకనే చెప్పింది. ఎప్పటికైనా మంచు లక్ష్మి తెలుగు ఉచ్చరణను చూసి ‘దేవుడా…’ అనుకోవడం వీక్షకుల వంతు..!
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…
Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…