
Congress and DMK Face a Delimitation Row
డీలిమిటేషన్ బిల్లు ఇంకా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టక మునుపే దేశంలోని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ సమీకరణాలు మారిపోయేలా చేస్తోంది. దీనిని కాంగ్రెస్-ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఈ కూటమిలో భాగస్వాములుగా ఉన్న డీఎంకే, ఎన్సీపీలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో కూటమిలో కలకలం మొదలైంది.
నిజానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజార్టీ లేక బయటి పార్టీల మద్దతు కోసం కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో మూడు దశాబ్దాల అనుబందం తెంచుకొని విజయ్‌కు మద్దతు ఇచ్చింది.
ఆ తర్వాత రెండు మంత్రి పదవులు పొందింది. కనుక వాటి కోసమే తమకు ద్రోహం చేసిందని డీఎంకే అధినేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని అప్పుడే చెప్పేశారు. అయితే అప్పుడు అయన మాటలను కాంగ్రెస్ అధిష్టానం బొత్తిగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే స్టాలిన్ చేతులు పట్టుకునేందుకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితరులు చెన్నైకి బయలుదేరారు!
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వదని స్టాలిన్‌ను బ్రతిమాలుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం బయలుదేరడం సిగ్గుచేటు. అయితే ఇది కేవలం ఈ బిల్లు గురించి మాత్రమే కాదని, డీఎంకే పార్టీ ఇండియా కూటమిని వీడి ఎక్కడ బిజేపితో చేతులు కలిపి ఎన్డీయే కూటమిలో చేరిపోతుందనే భయంతోనే అని అందరికీ తెలుసు.
తమ పార్టీ కేవలం ఈ బిల్లుకు మాత్రమే మద్దతు ఇస్తోందని అంత మాత్రాన్న బిజేపితో చేతులు కలుపుతున్నట్లు లేదా ఎన్డీయేలో చేరుతున్నట్లు భావించరాదని స్టాలిన్ చాలా స్పష్టంగానే చెప్పారు. అయినా కాంగ్రెస్ నేతలు ఆయనను కలిసేందుకు హడావుడిగా చెన్నై బయలుదేరి వెళ్ళారు.
వారు స్టాలిన్‌ని ఒప్పించగలరని అనుకోలేము. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ తమను కాదని విజయ్‌తో చేతులు కలపడం ఒక కారణమైతే, పాత కేసులు, కేంద్రంతో అవసరాలు, రాష్ట్ర స్థాయిలో రాజకీయ లెక్కలు వగైరా అన్నీ చూసుకుంటారు తప్ప కాంగ్రెస్‌తో దోస్తీ ముఖ్యం కాదు.
ఏది ఏమైనప్పటికీ, తమిళనాడులో ద్రవిడ పార్టీలది ఎప్పుడూ జాతీయ పార్టీలకంటే పైచేయిగానే ఉంటుందని నేడు స్టాలిన్ మరోసారి నిరూపించి చూపారు.
Suriya's film Scene directed by Jithu Madhavan was released in theatres on 6th November as…
Senior INDIA bloc leaders arrived in Chennai on Sunday to persuade DMK president MK Stalin…