
ఏపీకి హోదా లేదు, ప్యాకేజ్ మాత్రమే అని మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్న నేపధ్యంలో తిరుపతి నుండి ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ కాంగ్రెస్ మహిళా నేత స్పందిస్తూ… తిరుపతి వేదికగా ఆనాడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిన ప్రకటనలను అమలు చేయాలని, లేని పక్షంలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను గుడ్డలూడదీసి కొడతామని, కాకినాడ సభలో మేమే ఈ పని చేస్తాము ఖబడ్దార్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘ప్రత్యేక హోదా’ ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి పవన్ పై మండిపడడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో కాంగ్రెస్ కైనా తెలుసో లేదో గానీ, ఈ వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక మహిళగా వ్యాఖ్యానించాల్సిన మాటలు కాదని, ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. బహుశా నాడు వైఎస్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇపుడు రివేంజ్ తీర్చుకుంటున్నారేమో..!
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…