Telugu

ఏపీ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది… ఏదో ఒకటి చేయక తప్పదు!

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఈ జగన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మనసు కరుగలేదు. ఇటువంటి వ్యక్తికి రాజకీయాలు ఏం తెలుసు? గూండాయిజం చేస్తూ అందరిపై దాడులు చేస్తూ సామాన్య ప్రజలని వేధిస్తూ భయబ్రాంతులను చేస్తున్నారు. పేదప్రజలని వెక్కిరిస్తున్నట్లు రోజుకో సంక్షేమ పధకం ప్రకటిస్తూ బంగారంలాంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు. రాష్ట్రాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా మార్చేశాడు. నేను ఇక్కడకి వచ్చినప్పుడల్లా ప్రజలు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని కోరుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలనేది తప్పక ఆలోచిద్దాం.

“గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారా?” అనే విలేఖరి ప్రశ్నకి “యస్! వైనాట్?మా అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా గుడివాడ నుంచి పోటీ చేస్తాను. ఇక్కడి ప్రజలు ఈ ముఖ్యమంత్రిని అసహ్యించుకొంటున్నారు. తమని కాపాడే నాధుడు ఎవరైనా వస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఈ రాష్ట్రం ఆయన ఆస్తిలో వాటా కాదు. కనుక నేను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతాను. ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. ఈసారి ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఓడించాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను.

ADVERTISEMENT

సుప్రీంకోర్టు ఆదేశాలనే పాటించని ఈ పిచ్చి ముఖ్యమంత్రి మాటలని ప్రజలు ఎందుకు వినాలి? మేమేందుకు వినాలని నేను ప్రశ్నిస్తున్నాను.

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై విలేఖరి అడిగిన ప్రశ్నకి రేణుకా చౌదరి సమాధానం చెపుతూ, “ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు పెట్టడాన్ని నేను సమర్ధించను. రాజశేఖర్ రెడ్డిగారి పేరు పెడితే ఆయన గౌరవం పెరుగుతుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. అలాంటి నిర్ణయాలు తీసుకొంటున్న వ్యక్తి మెంటల్ కండీషన్ ఏవిదంగా ఉందనేది మనం చూడాలి. ఈ పిచ్చి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కావాలంటే నేను ఉచితంగా చికిత్స చేయించుకు సిద్దంగా ఉన్నాను,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ఏపీ అప్పులలో మునిగిపోయి దివాళా తీస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి చెపుతుంటారు. మాల్లీ కేంద్ర ప్రభుత్వమే ఏపీకి అప్పులు ఇస్తుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” అని విలేఖరి ప్రశ్నకి బదులిస్తూ, “ఇది బిజెపి, వైసీపీల మద్య అవగాహనతోనే జరుగుతోందని భావిస్తున్నాను లేదా ఏపీ అడిగినంతా కేంద్రం అప్పులు ఇప్పిస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయించిన తర్వాత ఎన్నికలకి ముందు వీళ్ళ తోకలు కత్తిరించి సున్నం పెడతారేమో?” అని రేణుకా చౌదరి అన్నారు.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తుండటంపై విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “ఇక్కడో పిచ్చోడు… అక్కడో పిచ్చోడు మనకి తయారయ్యారు. ఇద్దరికిద్దరు ఇసుక తక్కెడ పేడ తక్కెడ అన్నట్లున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసి టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చేసుకొని దేశం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన జెండా, కారేసుకొని తిరిగినంత మాత్రాన్న దేశప్రజలు ఆయనని గుడ్డిగా నమ్మేయరని ఆయనే ఏదో రోజు తెలుసుకొంటాడు,” అని రేణుకా చౌదరి అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Needs Venky Atluri, But Why?

Vijay Devarakonda had a new release in the form of Ranabaali yesterday. The film opened…

1 minute ago

రేవంత్‌ని విమర్శించాలంటే చంద్రబాబుని పొగడాల్సిందే… తప్పదు!

అవును. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్న నోటితోనే ఇప్పుడు హరీష్‌ రావు పొగడక తప్పడం లేదు. అయితే చంద్రబాబు…

10 minutes ago