
Mallikarjun Kharge Neet Protest
దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలలో అక్రమాలు, పేపర్ లీక్ల పై ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం క్రమంగా జాతీయ చర్చగా మారింది. ఈ ఉద్యమంలో సీజేపీ కీలక పాత్ర పోషిస్తూ విద్యార్థుల తరుపున ఢిల్లీలో నిరసనలు, జంతర్ మంతర్ ధర్నాలు, పార్లమెంట్ మార్చ్ వంటి కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణల దిశగా అడుగులు వేయాల్సి వచ్చింది, అందుకోసం కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే సీజేపీ నిర్వహించిన నీట్ ఉద్యమానికి అటు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం ఇటు ప్రతిపక్షాల నుంచి మద్దతు తోడవడం తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా అనివార్యం అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ ఉద్యమం క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్ట సభలలో అధికార – ప్రతిపక్షాల మధ్య మధ్య మొదలైన నీట్ ఉద్యమ చర్చలు, వాదోపవాదనలు ఈ అంశాన్ని మరింత బలపరుస్తుంది.
లోక్ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతినేత పక్ష నేత రాహుల్ గాంధీ నీట్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేయడం తో ప్రభుత్వం భయపడిందని, ఆ ఒత్తిడి ధర్మేంద్ర రాజీనామా వరకు వెళ్ళిందంటూ సీజేపీ క్రిడిట్ ని కాంగ్రెస్ చోరీ చేసే ప్రయత్నం చేసింది.
అలాగే ఆ ఉద్యమ సమయంలో విద్యార్థుల పై జరిగిన పోలీస్ చర్యలను ఖండిస్తూ కేంద్ర హోమ్ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసారు. విద్యార్థుల పై దాడులు చేయించిన అమిత్ షా ను ఎదోకరోజు తానూ దాక్కున్న గది నుంచి బయటకు ఈడ్చుకొస్తామంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
నెలలతరబడి విద్యార్థులతో కలిసి పోరాడిన సీజేపీ పాత్రను పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ నీట్ ఉద్యమ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంటూ తన రాజకీయ ఎజెండాలో భాగంగా చూపిస్తూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం పై విమర్శలు ఎదురవుతున్నాయి.
ఇన్నాళ్ళుగా జాతీయ పార్టీ అనధికార అధినేత స్థానంలో ఉంటూ, కేంద్ర ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ కి సాధ్యం కానిది సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సాధ్యం చేసి చూపించింది. పుష్కరకాల బీజేపీ అధికారానికి ప్రజల ధిక్కార స్వరాన్ని బలంగా వినిపించగలిగింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచగలిగింది.
మరి అటువంటి సందర్భంలో కాంగ్రెస్ నీట్ ఉద్యమం క్రెడిట్ చోరీకి యత్నించడం, దానికి రాహుల్ ని హీరోగా చిత్రీకరించడం అత్యంత శోచనీయం అవుతుంది సుమీ..!
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…