Telugu

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే… కానీ పగ్గాలు వారి చేతుల్లోనే?

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఎన్నికయ్యారు. 137 సం.ల సుదీర్గ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చాలా దశాబ్ధాలపాటు గాంధీ కుటుంబం చేతిలోనే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఆరుసార్లు మాత్రమే వేరేవారికి పార్టీ పగ్గాలు లభించాయి. కానీ అదీ తాత్కాలికమే.

ఇప్పుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడం వెనుక సోనియా గాంధీ చక్రం తిప్పారనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఆయన సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు కనుక! తాను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ వారి సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిగ్గుపడనని ఆయన స్వయంగా చెప్పారు. అంటే వారి కనుసన్నలలో పార్టీని నడిపిస్తానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఇంతకంటే గొప్ప అర్హత ఏం కావాలి?

ADVERTISEMENT

అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోని గాంధీ కుటుంబం విధేయులందరూ ఆయనకే ఓట్లు వేసి గెలిపించారు. మొత్తం 9,000 మంది ఓటింగులో పాల్గొంటే వారిలో 7,897 మంది మల్లిఖార్జున ఖర్గేకు ఓట్లు వేయగా, 1,000 కంటే తక్కువ మంది మాత్రమే శశి ధరూర్‌కి ఓట్లు వేశారు.

ఇదివరకు ప్రధానమంత్రి కుర్చీలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కూర్చోబెట్టి సోనియా గాంధీ దేశాన్ని ఏవిదంగా పరిపాలించారో, ఇప్పుడూ అదే విదంగా వీరవిధేయుడైన ఖర్గేను అధ్యక్షుడి కుర్చీలో కూర్చోపెట్టి గాంధీ కుటుంబమే పార్టీని నడిపిస్తుంది.

వివిద రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్ళే కాంగ్రెస్‌ నేతలు మొదట సోనియా, రాహుల్ గాంధీలను దర్శనం చేసుకొన్న తర్వాతనే ఖర్గేను కలుస్తుండటం రేపటి నుంచి అందరూ చూడవచ్చు. అలాగే ఆయన కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా వారి అనుమతి తీసుకొన్న తర్వాతే అమలు చేస్తుంటారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే కొనసాగవచ్చు.

ఈవిదంగా గాంధీ కుటుంబం వెనుక సీటులో కూర్చొని కాంగ్రెస్‌ స్టీరింగ్ తిప్పడం ఎందుకు?వారే తిప్పదలచుకొంటే వద్దనేవారు ఎవరున్నారు?అంటే ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా వారి నోళ్ళను తమ వీరవిధేయులతో మూయించివేయగలరు. కానీ రాహుల్ గాంధీ, ప్రియాంకాలు కాంగ్రెస్‌ పగ్గాలు ఎందుకు చేపట్టలేదంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేనందునే.

కనుక వారు ముగ్గురూ వెనక సీటులో కూర్చొని కాంగ్రెస్‌ స్టీరింగ్ తిప్పుతూ ఎప్పటిలాగే పార్టీలో రాజలాంఛనాలు, సకల మర్యాదలు అనుభవిస్తూనే ఉంటారు. కానీ పార్టీ ఓటమి, వైఫల్యాల అపవాదులు, అప్రదిష్టలు మాత్రం ఖర్గే ఖాతాలో పడుతుంటాయి.

ఇదీగాక, కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం నెలకొని ఉందని చెప్పుకోవడానికి కూడా ఈ అధ్యక్ష ఎన్నికలు ఉపయోగపడతాయి. భారత్‌ జోడో అంటూ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కూడా ఇదే చెపుతున్నారు కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Paradise OTT Date: More Backlash Waiting on Netflix?

Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…

16 minutes ago

సీజేపీని ముందు పెట్టి పోరాటం అంటే…

కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…

46 minutes ago