అందాల నటిపై సంచలన ఆరోపణలు!

ఒకనాటి అందాల నటి, ఎందరో, మరెందరో కలల రాణి బాలీవుడ్ బ్యూటీ హేమమాలిని వివాదాల్లో చిక్కుకుంది. ఆర్.టి.ఐ యాక్ట్ క్రింద ఈమె చేసిన ఓ నిర్వాకాన్ని అనిల్ అనే అతను బయటపెట్టాడు. ముంబైలోని ఓషివారా ప్రాంతంలో దాదాపు ఒక మాసం క్రిందట మహారాష్ర్ట ప్రభుత్వం 2 వేల చదరపు మీటర్ల ప్లాట్‌ను కేటాయించిందని, అయితే, కోట్లాది విలువైన ఈ భూమిని 70 వేలకే హేమామాలినికి కేటాయించిందని, అంటే చదరపు మీటర్‌కు కేవలం 35 రూపాయలే వసూలు చేసారని… అనిల్ అనే ఆర్టీఐ యాక్టివిటిస్ట్ ఆరోపిస్తున్నారు.

సదరు ప్రదేశంలో 18.49 కోట్లతో డ్యాన్స్ అకాడమీని, కల్చరల్ కాంప్లెక్స్‌ని ఏర్పాటు చేస్తానని హేమమాలిని తెలిపిందట. అయితే సదరు మొత్తం సొమ్ములో 25 శాతం నిధులు తమ వద్ద ఉన్నట్లుగా ఆధారాలు సమర్పించాలని, కానీ, హేమా ప్రస్తుతం నిర్వహిస్తున్న అకాడమీ వద్ద 25 శాతం నిధులు లేవని, మూడున్నర కోట్లు మాత్రమే వున్నాయని అనిల్ పేర్కొన్నాడు.

గతంలో (1997లో) అప్పటి శివసేన ప్రభుత్వం హేమమాలినికి మరో భూమి కేటాయించినప్పుడు కూడా ఆమె, అవసరమైన పత్రాలు సమర్పించలేదని, పైగా ఆ భూమిని కూడా ప్రభుత్వానికి తిరిగి అప్పగించలేదని అనిల్ ఆరోపిస్తున్నాడు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో హేమమాలిని పేరు తీవ్రంగా హల్చల్ చేస్తోంది.

Share
Published by

Recent Posts

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

23 minutes ago

బాలయ్య వారసత్వం మోక్షజ్ఞ చేతుల్లో… అసలు పరీక్ష మొదలు

నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…

23 minutes ago