
ప్రముఖ ప్రయివేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన రాపిడో, ఓలా, ఉబర్….సేవలు ప్రజల నుండి విశేష ఆదరణ చూడగొన్నాయి. అలాగే ఈ విధానం తో లక్షలాది మంది నిరుద్యోగులకు జీవనోపాధి కూడా దొరికినట్లయింది. వినోయోగదారులకు అనుకూలమైన ధరలతో ఈ ఆన్ లైన్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో వీటి వినియోగం నానాటికి విస్తరిస్తుంది.
అయితే ఈ సేవలను వినియోగించుకుంటున్న వినియోగదారులకు, వీటిని అందుబాటులో ఉంచుతున్న కార్పోరేట్ సంస్థలకు వీటి వల్ల తగిన లబ్ది చేకూరుతున్నప్పటికీ ఆ సేవలను నేరుగా అందుబాటులోకి తీసుకొస్తున్న రైడర్స్ కు మాత్రం వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అనే ఆవేదనైయితే వ్యక్తమవుతోంది.
కమిషన్ల పేరుతో బడా వ్యాపార సంస్థలే వారి ఆదాయానికి గండికొడుతున్నాయనే భావన ఈ సేవలను అందిస్తున్న రైడర్లలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కమిషన్ల దందాకు పూర్తిగా చెక్ పెట్టెలే కేంద్ర ప్రభుత్వం “సహకార టాక్సీ” పేరుతో ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.
మధ్యవర్తులు లేకుండా వాహనదారులకు నేరుగా లబ్ది చేకూరేలా త్వరలో ఈ సహకార టాక్సీ యాప్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. నేడు జరిగిన లోక్ సభ సమావేశంలో సహకార మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ సహకార టాక్సీ యాప్ ద్వారా ముఖ్యంగా రైడర్లకు కమిషన్ల బెడద తప్పదన్నారు, తద్వారా అటు వినియోగదారులకు, ఇటు రైడర్లకు ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందన్నారు.
ఈ యాప్ ద్వారా బైకులు, టాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్ విలీర్స్ సేవలు అందుబాటులోకి రానున్నట్టు ప్రకటించారు షా. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘సహకార్ సే సమృద్ధి’ ద్వారా రానున్న రోజులలో ఈ సహకార టాక్సీ సేవలు అందరికి అందుబాటులోకి రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్దేశికత్వంలో వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్న సహకార టాక్సీ తో ఇప్పటి వరకు ఈ వ్యాపార సామ్రాజ్యంలో రాజ్యమేలిన ఓలా, రాపిడో, ఉబర్ సేవలకు చెక్ పడనుందా.?
The next 24 hours could be extremely consequential in Indian politics as something big is…
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…