
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు ఆహార ఉత్పత్తులలో మాత్రమే శాఖాహారం, మాంసాహారాలను సులువుగా గుర్తించేందుకుగాను ప్యాకెట్లపై పచ్చ లేదా ఎరుపు రంగు చుక్కలు ముద్రించడం తప్పనిసరి చేసింది.
అయితే స్నానపు సబ్బులు, షాంపులు, బాడీ లోషన్స్, టూత్ పేస్టు, మహిళల మేకప్‌కు వాడే రసాయనాలు, లిప్ స్టిక్ వంటి అనేక ఉత్పత్తులలో కూడా జంతువుల కొవ్వు, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె, ఎముకల పొడి వంటివి కలుపుతున్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.
కనుక ఇక నుంచి ఆయా ఉత్పత్తులపై కూడా తప్పనిసరిగా పచ్చ రంగు, ఎరుపు లేదా గోధుమ రంగులో చుక్కలు ముద్రించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆహార ఉత్పత్తులపై పచ్చ, ఎరుపు చుక్కలు ముద్రించాల్సి వచ్చినప్పుడే చాలా కల్తీ ఉత్పత్తులకు అడ్డుకట్ట పడింది. ఇప్పుడు ఈ తాజా ఉత్తర్వులతో, ఆయా ఉత్పత్తులను విరివిగా అమ్ముకుంటున్న అనేక సంస్థలు ఆట ముగుస్తుంది.
కనుక ఇంతకాలం ఆయా ఉత్పత్తులను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమ్ముకొని లాభాలు గడిస్తున్న సంస్థలు, ఇప్పుడు ఈ కొత్త విషయం బయటపెడితే, ముందుగా శుద్ధ శాఖాహారులు షాక్ అవుతారు. ఆయా ఉత్పత్తుల కొనుగోలు మానుకుంటారు.
భారత్‌లో కోట్లాదిమంది శాఖాహారులున్నారు. కనుక ఈ చిన్న రంగు చుక్కలు ఆయా సంస్థల వ్యాపారాలు, ఆదాయం, లాభాలపై కూడా పడుతుంది. కనుక ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో… ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయో రాబోయే రోజుల్లో చూడవచ్చు.
Prabhas could be heading for another year with two releases, and that brings back an…
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత…