
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత అయన పేదల అసైన్డ్ భూములు కబ్జా చేశారంటూ జిల్లా రెవెన్యూ అధికారులను పరుగులు పెట్టించారు.
కానీ ఈటల రాజేందర్ వెంటనే బిజేపిలో చేరి ఆయన దూకుడుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే.
మళ్ళీ ఇంతకాలం తర్వాత కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభిస్తే ఈటల మౌనంగా ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌసు పరిధిలో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయంటూ సిఎం రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తున్నారు.
ఈటల రాజేందర్ దశాబ్దాలపాటు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితంగా మెలిగారు. కనుక ఫామ్‌హౌసు భూముల గురించి బాగా తెలిసే ఉంటుంది.
కనుక ఆయన రేవంత్ ప్రభుత్వానికి ఆ సమాచారం అందింఛవచ్చు. లేదా మీడియా ముందుకు వచ్చి వాటి గురించి వివరించి కేసీఆర్‌ని విమర్శించవచ్చు.
కానీ అసలు కేసీఆర్ ఫామ్‌హౌసు భూముల వ్యవహారం గురించి విననట్లు ఈటల రాజేందర్ మౌనంగా ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
బహుశః మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఉన్నందునే ఈటల రాజేందర్ సంయమనం పాటిస్తున్నారా లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరులో జోక్యం చేసుకునేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? లేక తాను కూడా పేదల అసైన్డ్ భూములు తీసుకున్నారు కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మౌనంగా ఉండిపోయారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఈటల రాజేందర్ నోరు విప్పకపోవడం కేసీఆర్ అదృష్టమనే భావించవచ్చు.
India survived a big scare against Japan, winning the one-off T20I by just two runs…
Kalki 2898 AD is set to receive its National Award honours today. The winners were…