
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయ్యి జైల్లో ఉన్న కవితను న్యాయస్థానం మందలించింది. కోర్ట్ ఆవరణలో మీడియాతో మాటామంతి ఏంటి అంటూ కవిత మీద ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు మీడియా ప్రశ్నలకు ఎలా సమాధానం చెపుతారు, మరో సారి ఇటువంటి చర్యలకు పాలపడవద్దు అంటూ న్యాయమూర్తి కావేరి బవేజా కవితకు ఆదేశాలు జారీ చేసారు.
అయితే ఇది సిబిఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అంటూ మీడియా ముందు తన గళం వినిపించిన కవిత రెండేళ్ల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని, బయట బీజేపీ నేతలు మాట్లాడేదే లోపల సిబిఐ అధికారులు అడుగుతున్నారన్నారు. కవిత వాదన ఇలా ఉంటే సిబిఐ అధికారుల వర్షన్ వేరేలా ఉంటుంది. కస్టడీలో కవిత తమ విచారణకు ఏవిధంగా సహకరించలేదంటూ అధికారులు కోర్టుకు తెలిపారు.
పొంతనలేని సమాధానాలు చెపుతూ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని, కవిత బెయిలు మీద బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదంటూ చేసిన సిబిఐ అధికారుల వాదనకు న్యాయస్థానం అంగీకరించి కవితను మరో 9 రోజులు సిబిఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. కవిత కేసు ఒక కొలిక్కి వస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల మీద ద్రుష్టి పెట్టి అధికార పార్టీని నిలువరించి తమ పార్టీ పట్టు నిలుపుకోవడానికి తొందర పడుతున్న బిఆర్ఎస్ అధినాయకత్వానికి కవిత కేసు అంతుచిక్కని రోగంలా తయారయ్యిందనే చెప్పాలి.
ఇప్పటికే పార్టీ సీనియర్లు ఒక్కొకరుగా కారు దిగుతుంటే, వారిని అడ్డుకోలేక పార్టీని బలపరచలేక సతమతమవుతున్న కేసీఆర్ కు కవిత కేసు పంటి కింద పడ్డ పచ్చి వెలక్కాయ మాదిరి ఇబ్బంది పెడుతుంది.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…