
చిన్నప్పటినుండీ ప్రతి పిల్లోడు క్రికెట్ చూడటానికి ఇవేమీ యానిమేషన్ తో కూడిన బొమ్మలూ కాదు, సినిమాల్లోని పాటలూ కాదు. మరి తల్లిదండ్రులు అప్పటికే మ్యాచ్ చూస్తుంటే, వారితో పాటు చూసి, ఒక ఆటగాడి ఆట పై మనసుపడి ఆ ఆటను ప్రేమిస్తారు పిల్లలు.
అటువంటి ఆటగాళ్ళెందరో ఈ సంవత్సరం తమ రిటైర్మెంట్ ను ప్రకటించి వారి అభిమానులను భావోద్వేగానికి గురయ్యేలా చేసారు. ఆ వరుస లో మొదటి స్థానం లో నిలిచారు భారత దిగ్గజాలు ‘విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ’. ఈ సంవత్సరం జరిగిన టి-20 కప్ ను గెలుచుకున్న వేళ మన భారత జట్టులో ముగ్గురు తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు.
విరాట్ కోహ్లీ ఈ వరుస లో మొదటి నిలవగా, కోహ్లీ బాటలోనే భారత సారధి రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా నిలిచారు. ఈ ముగ్గురూ కూడా తమ టి-20 కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ ఫాన్స్ ను భావోద్వేగానికి లోనయ్యేలా చేసారు. అదే వరుస లో నిలిచారు డేవిడ్ వార్నర్. టెస్ట్ క్రికెట్ కు 2023 లో ప్రకటించగా, 2024 జనవరి లో రిటైర్మెంట్ ఇచ్చారు.
2023 లో పాక్ తో జరిగే సిరీస్ ఏ తన ఆఖరి సిరీస్ అని చెప్పగా, ఆ సిరీస్ జనవరి 2024 లో ముగిసింది. జూన్ లో టి-20 రిటైర్మెంట్ తో వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయిపోయారు. ఇక అదే జూన్ లో న్యూజిలాండ్ లెజెండరీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు.తన 13 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ కు జూన్ 2024 తో ఫుల్ స్టాప్ పెట్టారు.
అదే దేశపు టెస్ట్ పేసర్ ‘వాగ్నెర్’ మరియు ఓపెనింగ్ బ్యాటర్ ‘కోలిన్ మన్రో’ అంతర్జీతయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంగ్లాండ్ జట్టు లెజెండరీ పేసర్ ‘ఆండర్సన్’ మరియు ఆల్-రౌండర్ ‘మొయిన్ అలీ’ కూడా ఇదే సంవత్సరంలో క్రికెట్ నుండి తప్పుకున్నారు. మరొక పేసర్ ‘టీం సౌథీ’ సైతం ఇటీవలే తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.
సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్ ‘డీన్ ఎల్గర్’ ఈ ఏడు జనవరి లో భారత్ తో టెస్ట్ సిరీస్ అనంతరం తన రిటైర్మెంట్ ను అమలుచేశారు. భారత ఆటగాళ్లు ‘దినేష్ కార్తీక్’ ఐపీఎల్ తో సహా అన్ని క్రికెట్ ఫార్మట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే ‘కేదార్ జాదవ్’ సైతం అన్ని అంతర్జాతీయ ఫార్మట్స్ కు వీడ్కోలు పలికారు.
అయితే, తాజాగా భారత లెజెండరీ స్పిన్నర్ ‘రవి అశ్విన్’ సైతం ఈ లిస్ట్ లో చేరారు. తన అమోఘమైన టెస్ట్ కెరీర్ నే కాక, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్తూ ఎందరో క్రికెట్ అభిమానులను కంట తడి పెట్టించాడు. ఇలా ఏడాదికి ఎందరో దిగ్గజ క్రికెట్ క్రీడాకారులు తమ బ్యాట్ కు, తమ బాల్ కు వీడ్కోలు పలుకుతూ తమ అభిమానులను భావోద్వేగాలకు గురి చేసారు.
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…