
ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో శాతం పోలింగ్ జరగడం యాదృచ్ఛికం కానే కాదు. ఈసారి ఎన్నికలలో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి గంటల తరబడి క్యూలైన్లలో ఓపికగా నిలబడి మరీ ఓట్లు వేశారు. ఇది కూడా యాదృచ్ఛికం కానే కాదు.
కనుక వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీల కూటమి దేనికవి పెరిగిన పోలింగ్ శాతాన్ని తమకు అనుకూలంగా అన్వయించుకుని తామే భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పుకుంటున్నాయి. అది సహజమే.
పురుషులు, మహిళల ఆలోచనా విధానం పూర్తి భిన్నంగా ఉన్నట్లే వారి ఓటింగ్ సరళి కూడా భిన్నంగా ఉంటుందని వేరే చెప్పక్కరలేదు.
గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులు, ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్ మతం పుచ్చుకున్న మహిళలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలు నిస్సందేహంగా వైసీపికే ఓట్లు వేసి ఉంటారు. ముఖ్యంగా సంక్షేమ పధకాలు మహిళలను చాలా ప్రభావితం చేసినందున వారి ఓట్లు వైసీపికే పడి ఉంటాయి.
కానీ వీరిలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మహిళల జీవనశైలి, ఆలోచనా విధానం భిన్నంగా ఉంటాయి. అలాగే ఆయా ప్రాంతాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తి భిన్నంగా ఉంటాయి.
ఉదాహరణకు అమరావతిని పక్కన పెట్టేయడం వలన ఆ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అమరావతి రైతులు నాలుగేళ్ళు ఆందోళనలు చేసినా సిఎం జగన్ ఏనాడూ పట్టించుకోకపోగా వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రాయలసీమలో నీటి ఎద్దడి వలన రైతులు, పనులు, ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనుక అక్కడ రైతు కుటుంబాలకు చెందిన మహిళలు వైసీపికి వ్యతిరేకంగా అంటే కూటమికి ఓట్లు వేసి ఉండవచ్చు.
మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్న మద్యపానం, సాగుత్రాగు నీరు, కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీలు వంటి కొన్ని సమస్యలు, కారణాల వలన కూడా వైసీపిని కాదనుకొని కూటమికి ఓట్లు వేసి ఉండవచ్చు.
అలాగే ఈ మూడు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు, వాటి నేతల ప్రభావం, ఒత్తిళ్ళు లేదా వారితో ఇబ్బందులు వంటివి కూడా వైసీపి అనుకూల మహిళల ఓటర్లలో చీలికలు సృష్టించి ఉండవచ్చు.
కానీ రాష్ట్రంలో బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, కాపు, వెలమ తదితర మిగిలిన సామాజిక వర్గాల మహిళలు మాత్రం ఖచ్చితంగా టిడిపి, జనసేన, బీజేపీల కూటమికే ఓట్లు వేస్తారు. ఈ సామాజిక వర్గాలలో ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టులు విద్యా, వైద్య తదితర రంగాలలో ఉన్నవారే.
వీరిలో చాలా మంది జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే లేదా ఏదో ఓ రూపంలో జగన్ ప్రభుత్వ బాధితులే. కనుక ఈ వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు కూటమికే ఓట్లు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ లెక్కన వైసీపికి అనుకూలంగా 50 శాతం మంది మహిళలు ఉన్నా, పైన పేర్కొన్న వివిద సమస్యలు, కారణాల వలన వారి ఓట్లు చీలి కూటమికి పడే అవకాశం కనిపిస్తోంది. ఈ మిగిలిన వర్గాలకు చెందిన 50 శాతం మహిళల ఓట్లు కచ్చితంగా కూటమికే పడతాయి. కనుక మహిళలలో 50 శాతం కంటే ఎక్కువ మంది కూటమికే ఓట్లు వేసి ఉంటారని భావించవచ్చు.
Vijayawada leader Vangaveeti Radha Krishna has joined the Jana Sena Party after leaving the Telugu…
Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…