
కాని ప్రభుత్వపరంగా తమకు ఈ పదకాలు అందించడం లేదని చెబుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను కేంద్రంపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా అభ్యంతరాలు అడ్డుగా ఉన్నాయని ఆమె వివరించారు.
అయితే బీజేపీకి సామర్ధ్యం ఎంత ఏపీలో? గట్టిగా 20 స్థానాల్లోనైనా ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా? ఇటీవలే జరిగిన కాకినాడ మునిసిపల్ ఎన్నికలలో తూర్పు గోదావరి బీజేపీ ప్రెసిడెంట్ ఒక కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే. అంతెందుకు ఇదే పురందేశ్వరి గారు రాజంపేట పార్లమెంట్ కు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన సంగతి ఎవరు మర్చిపోలేరుగా.
ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఏ వాగ్దానాలు నెరవేర్చకుండా 2014 కంటే బీజేపీ తన బలాన్ని తగ్గించుకుంది రాష్ట్రంలో. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నట్టు? బెదిరిస్తే మాత్రం బెదిరే పరిస్థితి ఉందా? విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా అభ్యంతరాలు అడ్డుగా ఉన్నాయా? ఏపీకి అభ్యంతరాలు ఉన్న రాష్ట్రం విడిపోలేదా? దానికి బీజేపీ మద్దత్తు ఇవ్వలేదా? ప్రజలు అంత అమాయకంగా కనపడుతున్నారా?
Hardik Pandya’s return to the Indian team could be delayed again after the all rounder…
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…