
ఈ నెల 27 న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకుల సందర్భంగా ఆ పార్టీ ఖైరతాబాద్ రెబల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యాయి.
2023 ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గా గెలిచిన దానం బిఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. దీనితో దానం నాగేందర్ ను అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా భావించారు ఆ పార్టీ శ్రేణులు.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి.
బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న రజతోత్సవ సభ తప్పక విజయ వంతం కానుంది, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చూసేందుకు తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో ఆ సభకు హాజరయ్యే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు.
అలాగే కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీనియర్ ఐఏఎస్, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లలో తప్పేముంది, ఆమె కేవలం వాస్తవ పరిస్థితులను మాత్రమే రి ట్వీట్ చేసింది అంటూ ఆమె ప్రభుత్వం పై చేసిన విమర్శలకు మద్దతు పలికారు.
అయితే స్మితా సబర్వాల్ చేసిన పోస్టుల పట్ల కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు ఆమె పై అనేక విమర్శలు చేసారు. స్మితా ఐఏఎస్ అధికారి మాదిరి కాకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మాదిరి వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వంలో భాగమై ఉంటూ అదే ప్రభుత్వ చర్యలను తప్పుబట్టడం ఏంటంటూ అధికార పార్టీ నేతలు స్మితా చర్యలకు కౌంటర్లు వేశారు.
ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం బిఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా, కేసీఆర్ కు మద్దతుగా, స్మితా చర్యలకు వంతపాడుతూ అధికార పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ప్రకటనలు ఆయన ‘గోడ మీద పిల్లి’ వాటం ప్రదర్శిస్తున్నారా అన్న అనుమానాలకు తావిస్తుంది.
రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే వాదనను దానం తన చర్యలతో మరోసారి రుజువు చెయ్యాలని భావిస్తున్నారేమో.! కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల పట్ల ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, తెలంగాణ సమాజం మొత్తం బిఆర్ఎస్ రాక కోసం ఎదురు చేస్తుందంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో దానం ఏకీభవిస్తున్నారా.?
త్వరలోనే తన తప్పు తెలుసుకుని తిరిగి సొంత పార్టీ గూటికి చేరడానికి, బిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి దానం కాంగ్రెస్ ప్రభుత్వం పై ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. మరి దానం ప్రదర్శిస్తున్న గోడ మీద పిల్లి వాటం ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఎదరికి చేరుస్తుందో చూడాలి.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…