
‘దండుపాళ్యం’ పార్ట్ 2, 3 అంటూ హంగామా చేసినప్పటికీ, వాటిని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఓ పార్ట్ లో అయితే హీరోయిన్ సంజను న్యూడ్ గా చిత్రీకరించారని పబ్లిసిటీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇలా ఆదరణ కోల్పోయినప్పటికీ, ఈ సినిమా సీక్వెల్స్ పరంపర మాత్రం ఆగకపోవడం శోచనీయం. తాజాగా ‘దండుపాళ్యం’ పార్ట్ 4 కూడా రెడీ అవుతుండడం విశేషం.
ఈ సారి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సుమన్ రంగనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో దీనిని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుండడం విశేషం. జైల్లో ఉన్న తమ బ్యాచ్ ను తప్పించడానికి ‘దండు’ నాయకురాలిగా సుమన్ రంగనాథ్ ఏం చేయనుంది? అన్న కోణంలో ఈ సినిమా కధను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చెప్పుకుంటుంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం, స్థానిక…
Manjeera water has been a lifeline for Hyderabad, supplying water for cooking and sanitation for…