
మరో నెలలోనే లైసెన్స్ వస్తుందని భావిస్తున్నాం. డేటా సర్వీసులే లక్ష్యంగా మొదటి ఆరు నెలలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నాం. భారత్ లో నెలకు 1000-1500 రూపాయల మధ్య ఖర్చు చేయగలిగే వారు మాత్రమే జియో 300 రూపాయల డేటా ప్లాన్ ను భరించగలరు. ఇలా ఖర్చు చేయగలిగే వారు దేశంలో 30 కోట్ల మందే. మిగిలిన వారు నెలకు 90 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలరు. అటువంటి వారికి జియో ఆఫర్ భారం కానుందని తులి తెలిపారు. కాబట్టి నెలకు 20 రూపాయలు అంతకంటే తక్కువ ధరకే డేటాను అందించే లక్ష్యంతో డేటా విండ్ రంగంలోకి దిగనుందని చెప్పారు.
ఈ ప్లాన్ ప్రకారం భారత్ లో సగటు వినియోగదారుడు డేటా కోసం ఏడాదికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడని, అంతకు మించకుండా డేటా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఇది అందుబాటులోకి వస్తే…జియో ఠారెత్తిపోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే డేటా రేట్లపై జియోతో పోటీ ప్రారంభించిన టెలికాం సంస్థలు డేటా విండ్ రంగప్రవేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. అయితే ఈ పోటీతత్వంతో దిగజారుతున్న ధరలను చూస్తుంటే… ఇప్పటివరకు తమ నుండి టెలికాం కంపెనీలు ఏ స్థాయిలో దోచుకున్నారో అంటూ నోరెళ్ళబెడుతున్నారు.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…