
అందులో వార్నరే బాల్ టాంపరింగ్ కు సూత్రధారి అని జట్టు ఆటగాళ్లంతా సీఏకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో వార్నర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్మిత్ కు చెప్పి బాన్ క్రాఫ్ట్ తో బాట్ టాంపరింగ్ చేయించింది వార్నరేని, ఈ విషయం బాన్ క్రాఫ్ట్ సహచర పేసర్లు, మిచెల్ స్టార్క్, హాజెల్ వుడ్ తో పాటు స్పిన్నర్ లియాన్ కు కూడా తెలియదని తెలుస్తోంది. వార్నర్ వల్లే జట్టు పరువుపోయిందని పేసర్లు తీవ్రంగా ఆరోపించారట.
అంతే కాకుండా వార్నర్ పై పూర్తిగా నమ్మకం కోల్పోయామని, వార్నర్ తో కలిసి మైదానంలో దిగేది లేదని కూడా సహచరులు సీఏకు స్పష్టం చేసినట్టు సమాచారం. వార్నర్ తప్పును కప్పిపుచ్చేందుకు స్మిత్ జరిగిన తప్పును జట్టు నిర్ణయంగా చెప్పినట్టు, దీంతో ఆటగాళ్లు భగ్గమన్నట్టు తెలుస్తోంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా చెడిపోయిందని, ఆటగాళ్లు వర్గాలుగా మారారని ఆ కథనం వెల్లడించింది. విచారణలో వార్నర్ దే తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకొనున్నట్టు తెలుస్తోంది.
Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…
The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…