డిసి సినిమా రివ్యూ: అనిరుధ్ బ్లడీ మ్యూజికల్ కాన్సర్ట్!

చిత్రం: డిసి

M9 రేటింగ్: 3/5

ADVERTISEMENT

విడుదల తేదీ: ఆగస్ట్ 07, 2026

తారాగణం: లోకేష్ కనగరాజ్, వామిక గబ్బి, అవినాష్ రఘుదేవన్, క్రిష్ దయాల్, సంజన కృష్ణమూర్తి తదితరులు

నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్

దర్శకత్వం: అరుణ్ మాతేశ్వరన్

సంగీతం: అనిరుధ్

నిర్మాత: కళానిధి మారన్

ఛాయాగ్రహణం: ముఖేష్ జి

కూర్పు: ప్రసన్న జీకే

తమిళ పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతూ నటించిన సినిమా “డిసి”. “కెప్టెన్ మిల్లర్” ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం ఆయువుపట్టుగా నిలిచింది. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ & పాటలతోనే సినిమాకి బీభత్సమైన హైప్ ఏర్పడింది. మరి సినిమా ఆ హైప్ ను అందుకోగలిగిందా? లేదా? హీరోగా లోకేష్ కనగరాజ్ సక్సెస్ ఫుల్ డెబ్యూ ఇవ్వగలిగాడా? అనేది చూద్దాం..!!

కథ:

సినిమాలో పైకి కనిపించే కథ ఒకటి, మూలకథ ఒకటి.
దేవదాసు (లోకేష్ కనగరాజ్) చిన్నప్పుడే తన తల్లిని చంపిన మేనమావల్ని కిరాతకంగా చంపి, జైలుకి వెళ్లి.. అక్కడ పరిచయమైన సర్కార్ అనే వ్యక్తితో కలిసి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఉంటాడు. తుపాకుల చోరీ అనంతరం దేవదాస్ & గ్యాంగ్ పై నిఘా పెరుగుతుంది. సీనియర్ పోలీస్ అధికారి భోజరాజ్ & టీమ్ డాస్ & గ్యాంగ్ ను పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఆ క్రమంలో పరిచయమవుతారు పార్వతి (సంజన కృష్ణమూర్తి) & చంద్ర (వామిక గబ్బి). ఈ ఇద్దరు అమ్మాయిల పరిచయం అనంతరం దాసు జీవితం ఎలా మారింది? అనేది పైకి కనిపించే కథ.
కొడుకుని చదివించడం కోసం తండ్రితో గొడవపడి మరీ పొలం అమ్మేసిన ఒక వ్యక్తి.. ఆ డబ్బుతో ఒక చెక్ పోస్ట్ దాటుతుండగా, దానికి కాపలా ఉన్న పోలీసులు అతడ్ని చంపేసి నలుగురి జీవితాలని దుర్భరం చేస్తారు. ఆ అన్యాయానికి ఎదురెళ్లిన దాసు ఓ వ్యవస్థకి ఎలా ఎదురీదాడు? అనేది మూలకథ.
ఈ రెండు కథలు ఒకదానితో ఒకటి మెలికపడి కన్ఫ్యూజ్ అవ్వకుండా నడిపిన విధానమే “డిసి” చిత్రం.

నటీనటుల పనితీరు:

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఏం యాక్టింగ్ చేస్తాడులే అనుకున్నవాళ్లందరికీ గట్టి సమాధానం ఇచ్చాడు. ఎక్స్ ప్రెషన్స్ తో పనిలేకుండా కేవలం యాక్షన్ తోనే అలరించాడు. లుక్స్ & బాడీ లాంగ్వేజ్ లో రౌడీతనం కొట్టొచ్చినట్లు కనిపించింది.
వామిక గబ్బి బాగా నటిస్తుంది అనేది కొత్త విషయం కాకపోయినా.. మొదటిసారి వేశ్యాగృహం నుండి బయటికి వచ్చి ఒక్కసారిగా స్వేచ్ఛను అనుభూతి చెందినప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆనందం నటిగా ఆమె స్థాయిని మరోసారి చాటి చెప్పింది. అలాగే.. లోకేష్ తో కలిసి చేసిన యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది.
కిట్టీ అనే పాత్రలో అవినాష్, పోలీస్ భోజరాజ్ గా క్రిష్ దయాల్ లు తమ నటనతో మెప్పించారు. చిన్నపాత్ర అయినప్పటికీ సంజన కృష్ణమూర్తి ఇంపాక్ట్ ప్లేయర్ లా ఆకట్టుకుంది.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకి అనిరుధ్ సంగీత దర్శకుడు మాత్రమే కాదు.. హీరో అని చెప్పాలి. క్లాసికల్ & వెస్ట్రన్ మ్యూజిక్ కలగలిపిన ఫ్యూజన్ మిక్స్ తో ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేశాడు. సన్నివేశంలోని ఎమోషన్ తో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడు బ్యాగ్రౌండ్ స్కోర్ కి వెర్రెక్కిపోతాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్రాన్స్ బీజియం అనేది బోనస్.
అనిరుధ్ తర్వాత సినిమా విషయంలో మెచ్చుకోవాల్సిన మరో టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ ముఖేష్. ఫ్రేమింగ్స్ & లైటింగ్ తో ఆటాడుకున్నాడు. గత దశాబ్దకాలంలో అత్యుత్తమ సినిమాటోగ్రఫీ వర్క్ గా “డిసి”ని చేర్చొచ్చు. ఒక్కో ఫ్రేమ్ గురించి పది నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ & కలరింగ్ వర్క్.
ప్రొడక్షన్ డిజైన్ & ప్రోస్థేటిక్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ప్రతి షాట్, ప్రతి బుల్లెట్, ప్రతి దెబ్బ, ప్రతి రక్తపు చుక్క చాలా సహజంగా ఉంటాయి. “జల్సా” తర్వాత బ్లడ్ సీన్స్ ఇంత రస్టిక్ గా డిసిలోనే కనీపంచాయి.
దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ టేకింగ్ స్టైల్ తెలిసినవాళ్ళకి ఈ సినిమా కొత్తగా కనిపించకపోవచ్చు కానీ.. కథ-మూలకథను చాలా జాగ్రత్తగా అల్లుకున్న విధానం బాగుంది. క్యారెక్టర్ తాలూకు జర్నీ & క్యారెక్టర్ ఆర్క్ రాసుకున్న విధానం మాత్రం ప్రశంసార్హం. ముఖ్యంగా సీన్ కంపోజిషన్స్ & స్క్రీన్ ప్లేతో కట్టిపడేశాడు. అయితే.. క్యారెక్టర్ బిహేవియర్ మాత్రం రొటీన్ గా ఉండడంతో ఒక కంప్లీట్ ఫ్రెష్ నెస్ మాత్రం రాలేదు.
తెలుగు డబ్బింగ్ విషయంలో తీసుకున్న కేర్ బాగుంది. టైటిల్ ఫాంట్స్ నుండి, సినిమాలో వచ్చే ఊర్ల టైటిల్స్ వరకు అన్నీ చాలా జాగ్రత్తగా సెట్ చేశారు. అందువల్ల డబ్బింగ్ సినిమా అయినా.. ఎక్కడా ఇబ్బందిగా ఉండదు.

విశ్లేషణ:

ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా చూసిన సినిమాలు భలే మెప్పిస్తాయి. “డిసి” సరిగ్గా అలాంటి సినిమానే. అనిరుధ్ మ్యూజిక్, ముఖేష్ సినిమాటోగ్రఫీ, వామిక యాక్టింగ్ కోసం ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లో చూడాలి. అయితే.. హింసపాళ్లు కాస్త ఎక్కువగా ఉండడం, తమిళ ఫ్లేవర్ ఎక్కువవ్వడం వంటివి ఇబ్బందిపెడతాయి. వాటికి ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం అనిరుధ్ విశేషంగా అలరిస్తాడు.

ఓవరాల్ గా.. అనిరుధ్ బ్లడీ మ్యూజికల్ కాన్సర్ట్!

M9 రేటింగ్: 3/5

 

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

Box Office: A Disaster Weekend @ Tollywood

The Telugu box office is usually explosive in nature when there is an interesting film…

21 minutes ago

రెడ్డి గారి మద్దతుతో బీసీ-సీఎం…అసందర్భమమైన ప్రకటనా.?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో…

30 minutes ago