
Revanth Reddy Leadership And Congress BC CM Debate
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి దశాబ్దం పట్టింది. ఈ దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే సరైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మచ్చుకైనా కానరాలేదు అంటే అతిశయోక్తి కాదేమో.
అటువంటి పరిస్థితులలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చిన రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి మరి నాటి అధికార బిఆర్ఎస్ పై ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం పై తాడోపేడో అన్నట్టుగా ఒంటరిగా రాజకీయ యుద్ధం చేసారు. దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ విపక్షం నుంచి అధికార పక్షంలోకి రాగలిగింది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అధికార – విపక్షాల మధ్య పోరు కూడా రేవంత్ vs బిఆర్ఎస్ గానే ముందుకెళుతుంది. బిఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పై కన్నా కూడా సీఎం రేవంత్ పైనే ఎక్కువ ఫోకస్ పెడతారు, రేవంత్ టార్గెట్ గానే విమర్శలు సంధిస్తారు.
ఇక ఇటు అధికార పార్టీ నుంచి కూడా బిఆర్ఎస్ కు బలమైన కౌంటర్ ఇవ్వాలంటే అది కేవలం సీఎం రేవంత్ మాత్రమే అనేది కాదనలేని సత్యం. బిఆర్ఎస్ నోటికి తాళం వెయ్యాలన్నా, ఆ పార్టీ నేతలను డిఫెన్స్ లో పడేయాలన్నా, బిఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ ట్రాప్ లోకి తీసుకురావాలన్న కూడా అది కేవలం రేవంత్ తోనే సాధ్యం అనేలా తాజా పరిణామాలతో రేవంత్ మరోసారి నిరూపించుకున్నారు.
ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ నాయకత్వంలో ముందుకు సాగడం ఆ పార్టీకి అత్యతం శ్రేయస్కరం అనే వాదన కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ కి రేవంతే సరైన నాయకుడు అనుకుంటున్న సందర్భంలో రాష్ట్రానికి బీసీ నేత సీఎం అవుతారంటూ టి.పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత వర్గ పోరును మరోసారి బయటపెట్టినట్లయ్యింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుతో తెలంగాణ రాష్ట్రానికి బీసీ నేత ముఖ్యమంత్రిగా అవుతారని మహేష్ గౌడ్ బహిరంగ ప్రకటన చేసారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ ఇచ్చిన ధైర్యంతోనే తానూ ఈ ప్రకటన చేస్తున్నానని, శంషాబాద్ లో జరిగిన ఓబీసీ సింహ గర్జన కార్యక్రమంలో ప్రకటించారు.
అయితే మహేష్ గౌడ్ చేసిన ఈ బీసీ ముఖ్యమంత్రి నినాదం పూర్తిగా అసందర్భం అనేది సొంత పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్న వాదన. ఒకపక్క రేవంత్ రాష్ట్రానికి పదేళ్లు తానే సీఎం అంటూ ప్రకటనలు చేస్తుంటే, అందుకు తగ్గట్టే తన రాజకీయంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులను, మరీముఖ్యంగా కల్వకంట్ల నేతలను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. రేవంత్ విసిరిన కల్వకుంట్ల ఆస్తుల చిట్టా పొద్దు పాచికతో కేటీఆర్, పూర్తిగా రేవంత్ పొలిటికల్ ట్రాప్ లో చిక్కుకున్నారు.
ఆక్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆస్తుల పై, కల్వకుంట్ల భూముల పై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ప్రకటనలు బిఆర్ఎస్ ను మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రాజకీయానికి ఉడతాభక్తి గా సాయం చెయ్యాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ తరుపున బీసీ సీఎం అంటూ ప్రకటనలు చేస్తూ రేవంత్ నాయకత్వాన్ని బలహీనపరచడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నేతలకు చేచేతుల రాజకీయ అస్త్రాలను అందిస్తున్నారు.
The wait for Akhanda 3 is going to be a long one, but there is…
Kiran Abbavaram is coming up with an entertainer, #KA13. Written and directed by Kiran Abbavaram…