Telugu

డెడ్లీ రిలేషన్‌షిప్స్… సమాజం ఇలా మారిపోతోందే!

భర్తని భార్య లేదా భార్యని భర్త చంపేసుకుంటున్న వార్తలు ఇప్పుడు తరచూ కనపడుతున్నాయి. అలాగే తల్లి తండ్రులు పిల్లలను లేదా కొడుకు, కూతుర్లే తల్లి తండ్రులను చంపేస్తున్న వార్తలు కూడా చూస్తూనే ఉన్నాము. కొందరు కుటుంబ కలహాలు లేదా ఆర్ధిక సమస్యలు కారణంగా హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు అక్రమ సంబందాలకు అడ్డుగా ఉన్నారని చంపేస్తున్నారు. నేటికీ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు బలంగా ఉన్న మన దేశంలో ప్రజల ఆలోచనలలో ఇటువంటి మార్పు రావడం చాలా అసాధారణమనే చెప్పాలి.

నిన్న ఓ పత్రికలో ఏపీలో ఒక జిల్లాలో స్కూల్లో చదువుకునే విద్యార్ధులు సైతం అందుబాటులో ఉన్న ఆటో డ్రైవర్లు, పరిచయస్తులలో ఎవరో ఒకరిని ప్రేమించి లేచిపోతున్నారని, తర్వాత తప్పు చేశామని గ్రహించి లేదా మోసపోయామని తెలుసుకునో ఇళ్ళకు తిరిగివస్తున్నారని వార్త వచ్చింది. వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని, కనుక పోలీసులు అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఆ వార్త సారాంశం.

ADVERTISEMENT

చదువుకునే వయసులో ఆలోచనలలో పరిపక్వత ఉండదు కనుక తప్పులు చేయడం సహజం. కానీ కుటుంబం ఉన్నవారు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని లేచిపోవడం లేదా హత్యలు చేయడాన్ని ఏవిధంగా చూడాలి? మనుషుల ఆలోచనా ధోరణి ఇంత ‘వయోలెంట్’గా ఎప్పుడు ఎందుకు మారింది? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వాలు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో థార్ జిల్లాలో ఓ వివాహిత చాలా అందగత్తె. ఆమెకు తన భర్త కాస్త చామనచాయగా ఉండటంతో అసహ్యించుకుంటూ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదే తప్పనుకుంటే, ఆమె ప్రియుడుతో కలిసి భర్తని దారుణంగా హత్య చేసింది. ఈ హత్యని దోపిడీగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసుల విచారణలో తానే భర్తని అడ్డుతొలగించుకునేందుకు ఈ దోపిడీ-హత్య ప్లాన్ చేశానని ఒప్పుకుంది. తర్వాత కథ తెలిసిందే.

తన అందానికి భర్త తగినవాడు కాడనుకుంటే హత్య చేసేయడమేనా? విడాకులు ఇచ్చి మరో అందగాడిని పెళ్ళి చేసుకోవచ్చు కదా? కానీ భర్త నచ్చకపోయినా అతని ఆస్తి కావాలనుకుంది ఆమె. అందుకే ఈ ప్లాన్ వేసి దొరికిపోయింది. కనుక ఇప్పుడు చిన్న చిన్న కారణాలకు, అవసరాలకు కూడా హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు నెలకొని ఉండటం చాలా ఆందోళనకరమే! కానీ హూ కేర్స్? ఇవి జస్ట్ న్యూస్ ఛానల్‌ ఐటమ్స్ మాత్రమే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

31 minutes ago

Nani’s The Paradise: Is an A Certificate Waiting?

Nani’s The Paradise is heading towards a September 24 release with a 2 hour 49…

34 minutes ago