
నిన్న కాశ్మీర్ లో పర్యటకుల మీద జరిగిన మారణకాండ యావత్ భారతదేశాన్ని కలచివేసింది. అయితే ఈ మతోన్మాద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఈ దారుణాన్ని ఖండించారు, భారతీయుల చావులకు కారణమైన వారికి భారత సైన్యం సత్తా ఏంటో చూపించాలి అంటూ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో వార్త ఈ ఉగ్రవాద చర్యల పై ఉలిక్కిపడేలా చేస్తుంది. భారత టీం ఇండియా హెడ్ కౌచ్, మాజీ టీం ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు హత్య బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ‘ఐ కిల్ యు’ అంటూ గంభీర్ మెయిల్ కు మెసేజ్ వచ్చినట్టు గంభీర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఐసిస్ కాశ్మీర్ నుంచి గౌతమ్ గంభీర్ మెయిల్ కు ఈ తరహా మెసెజ్ లు వచ్చినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. తాజాగా కాశ్మీర్ లో ఉగ్రదాడి కలవరపెడుతున్న ఇటువంటి సమయంలో భారత టీం ఇండియా హెడ్ కౌచ్ పై ఇటువంటి బెదిరింపులు రావడంతో అధికారులు కూడా ఎలర్ట్ అయ్యి దర్యాప్తు చేపట్టారు.
అటు గంభీర్ కూడా నిన్ను చంపుతాం అంటూ వచ్చిన మెసెజ్ లతో తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ పోలీసులను కోరారు. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా, గౌతమ్ గంభీర్ కు ఈ తరహా బెదిరింపు మెసెజ్ లు రావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
అయితే గౌతమ్ 2018 లో తన క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీలో చేరారు. ఇక 2019 ఈస్ట్ ఢిల్లీ నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి ఆప్ అభ్యర్థి పై విజయం సాధించి బీజేపీ ఎంపీ గా కొనసాగారు. అయితే 2024 లో బీజేపీ నుండి బయటకు వచ్చిన గంభీర్ తిరిగి తన క్రికెట్ రంగంలోనే తన సేవలను కొనసాగిస్తున్నారు.
ఈ తరుణంలో గౌతమ్ కు ఇటువంటి బెదిరింపులు రావడంతో కేంద్ర ప్రభుత్వం లో ఉన్న బీజేపీ నేతగా గౌతమ్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేసారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి సమయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయం వినపడుతుంది.
గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా ఈ తరహా బెదింపు కాల్స్ వచ్చిన విషయం, ఆ పై సల్మాన్ ఇంటి పై తుపాకీతో జరిగిన దాడి, అలాగే మరో హిందీ నటుడు సైఫ్ పై కూడా అతని సొంత ఇంట్లోనే కత్తితో హత్య ప్రయత్నం జరిగిన ఘటనలతో ఇప్పుడు గంభీర్ బెదిరింపు మెసెజ్ లు లైట్ తీసుకునే పరిస్థితులు లేవనేది స్పష్టమవుతుంది.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…