
అలాంటి వాలంటీర్ వ్యవస్థే రాష్ట్రానికి, ప్రభుత్వానికి భారమనుకొంటే, వారికి సాక్షి న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు జగన్ ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తోంది. వాలంటీర్ వ్యవస్థకే చట్టబద్దత లేదు. పైగా వారి పేరుతో జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పేపర్ అమ్మకాలను పెంచుకోవడం ఇంకా నేరం, చట్టవిరుద్దం అంటూ ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు గ్రూప్) ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సిఎం జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్య భారతిరెడ్డిని ఆరువారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు పంపించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. మరి వారు కోర్టుకి ఏం సమాధానం చెపుతారో?
చిత్రం: రణబాలి M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026 తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న,…
Keerthy Suresh hasn’t had the best run at the box office lately. Her recent films…