
వైసీపీ ఆత్మ సాక్షి, సాక్షి మీడియా హెరిటేజ్ ఫుడ్స్ మీద రాజకీయం మొదలుపెట్టింది. సాక్షిలో హెరిటేజ్ మీద ప్రచురించిన కథనాలు, ప్రసారం చేసిన వార్తలను, వాటి తాలూకా లింకులను తక్షణమే 24 గంటల లోపు తొలగించాలని లేని పక్షంలో గూగుల్, మోటా, యు ట్యూబ్ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సాక్షికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
అయితే అసలు విషయానికొస్తే, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బోలెబాబా డైయిరీకి హెరిటేజ్ ఫుడ్స్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ సాక్షి తన మీడియాలో కథనాలు వండి వడ్డించింది. అలాగే తిరుమల దేవస్థానం కి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తుందంటూ ఆరోపిస్తుంది.
అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవని, సాక్షి ప్రసారం చేసినట్లుగా తమ హెరిటేజ్ ఫుడ్స్ కి బోలెబాబా డైరీకి ఎటువంటి సంబంధం లేదని, అలాగే తిరుమల దేవస్థానం కు హెరిటేజ్ ఎప్పుడు నెయ్యి సరఫరా చెయ్యలేదని, అలా తమ సంస్థ పై అసత్య ప్రచారాలు చేసి తమ హెరిటేజ్ ఫుడ్స్ ప్రతిష్టతను దెబ్బతీయడం తగదంటూ హెరిటేజ్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టు ని ఆశ్రయించింది.
అలాగే సాక్షి పై 100 కోట్ల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. దీనితో ఢిల్లీ హైకోర్టు తక్షణమే హెరిటేజ్ పై సాక్షిలో ప్రసారమైన అన్ని కథనాల తాలూకా లింకులను తొలగించాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇటు తిరుమల దేవస్థానానికి హెరిటేజ్ నెయ్యి అంటూ వస్తున్న సాక్షి ఆరోపణలు పై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ నుంచి తిరుమల దేవస్థానానికి ఎటువంటి నెయ్యి సరఫరా కాలేదని ఇదంతా వైసీపీ ఆడుతున్న రాజకీయంలో భాగమే అంటూ సాక్షి కథనాలను, వైసీపీ నేతల ఆరోపణలను ఖండించారు.
The stage is being set for the upcoming local body election in Andhra Pradesh as…
Bollywood's biggest film Ramayana could face a massive setback in the US market, with its…