
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా అధికార – విపక్షాల మధ్య జరుగుతున్న నిరసనల రాజకీయం ఢిల్లీ వ్యాపారస్తుల పతనానికి వచ్చిందా అన్నట్టుగా అక్కడి చోటామోటా వ్యాపారస్తుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు ఈ ర్యాలీలు మాకొద్దు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సీజేపీ చేపడుతున్న ఉద్యమాలకు అధికార పార్టీ నేతలు పెడుతున్న ఆంక్షాలకు మధ్య మేము నలిగిపోతున్నాం, మా వ్యాపారాలు నష్టపోతున్నాం అంటూ వ్యాపారస్తులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బాహిరణగా లేఖ రూపంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
బీజేపీ – సీజేపీ మధ్య జరిగిన నీట్ ఉద్యమం వారిని కొంతవరకు ఆర్థికంగా నష్టపరిచినప్పటికీ, వెనువెంటనే సీఈసీ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్, సీజేపీ మరో ఉద్యమం చేపట్టడం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు మా ఈ పోరాటం ఆగదు అనేలా ముందుకెళ్లడం తో ఈసారి ఎన్డీయే ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేదెలా అన్నట్టుగా నిరసనకారుల ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు దేశ రాజధాని ఢిల్లీ ని ఆంక్షల వలయంలో బంధిస్తుంది.
ఇలా అటు అధికార పార్టీ తన పట్టు నిలుపుకోవడానికి, ఇటు విపక్షాలు తమ పంతం నెరవేర్చుకోవడానికి ఢిల్లీని తమ రాజకీయ బంధీగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ వేదికగా నవంబర్ -1 న కాంగ్రెస్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది.
అయితే రానున్నది పండగ సీజన్ అని, ఇలా ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు అంటూ పిలుపునిస్తే అధికార పార్టీ ఆంక్షలు అంటూ ముందుకెళుతుందని, తద్వారా తమ వ్యాపారాలకు సుమారు రూ.10 వేల కోట్ల మేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందంటూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తు రాహుల్ తన ర్యాలీని వాయిదా వేసుకోవాలంటూ కోరారు.
మీరు ర్యాలీలకు పిలుపునిస్తే ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో సేవల అంతరాయాలతో వినియోగదారులు లేక చాందిని చౌక్ సహా ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు అమ్మకాల పై ప్రభావం పడుతుందని, నవంబర్ -10 న భాయ్ దూజ్ పండుగ ముగిసే వరకు రాహుల్ తమ ర్యాలీని వాయిదా వేసుకోవాలంటూ విజ్ఞప్తి చేసుకున్నారు ఢిల్లీ వ్యాపార సంఘాల ప్రతినిధులు.
ఢిల్లీ వ్యాపారస్తుల ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు’…..సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా ఢిల్లీ వ్యాపారస్తుల ఆర్థిక నష్టానికి కారణంగా మారుతుంది. ఈ రాజీనామా నిరసనలు, ఉద్యమాలు, ఆంక్షలు ఏ రాజకీయ పార్టీకి రాజకీయ లబ్దిని చేకూరుస్తాయో, ఏ రాజకీయ పార్టీ నేతను నాయకుడిగా మారుస్తుందో తెలియదు కానీ వారి వారి రాజకీయల మధ్య ఒక సామాన్య వ్యాపారవేత్త నలిగిపోవడం మాత్రం అన్యాయమే…!
BOTTOM LINE Manoj Bajpayee’s Thriller Is a Big-Time Misfire PLATFORM Netflix RUNTIME 2 Hours What…
YSRCP president and former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has asked his…