Telugu

అప్పుడు ‘నో’.. ఇప్పుడు ‘యెస్’ ఎలా అయ్యింది?

భారత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. కేవలం ‘శాశ్వత ప్రయోజనాలు’ మాత్రమే ఉంటాయనడానికి ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’ తాజా పరిణామాలే నిదర్శనం. సరిగ్గా ఏడు నెలల క్రితం ఏప్రిల్ 2026లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును ‘దక్షిణాది రాష్ట్రాల పాలిట మరణశాసనం’ అంటూ తీవ్రంగా వ్యతిరేకించిన నాటి తమిళనాడు అధికార పక్షం డీఎంకే, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. ఇప్పుడు నవంబర్ 30న రాబోతున్న 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ‘జై’ కొట్టాయి.

అసలు ఈ ‘ఏడు నెలల’ కాలంలో ఏం మారింది? నాడు ‘నో’ చెప్పిన ఈ రెండు ప్రాంతీయ పార్టీలు నేడు ‘యెస్’ అనడానికి వెనుక ఉన్న రాజకీయ, రాజ్యాంగపరమైన కారణాలేంటి?

ADVERTISEMENT

నాటి ‘నో’ వెనుకున్న భయాలు…

ఏప్రిల్ 2026లో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ప్రతిపాదన ఉంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది శాపంగా మారుతుందని డీఎంకే, బీఆర్ఎస్, టి.కాంగ్రెస్ మూడు కూడా ఈ బిల్లుకు ‘నో’ చెప్పాయి.

దక్షిణాది ‘వాటా’ తగ్గుతుందనే రాజకీయ భయం: ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరగడం వల్ల, అక్కడ లోక్‌సభ సీట్లు భారీగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం నుండి19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని ఈ పార్టీలు ఆందోళన చెందాయి.

చట్టబద్ధమైన ‘హామీ’ లేకపోవడం: నాడు హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతామని మౌఖికంగా హామీ ఇచ్చినా, బిల్లు ముసాయిదాలో దానికి ఎలాంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించలేదు. అందుకే డీఎంకే లోక్‌సభలో వ్యతిరేకంగా ఓటు వేసి బిల్లును ఓడించగా, బీఆర్ఎస్ బయట నుండి తీవ్రంగా వ్యతిరేకించింది.

నేటి ‘యెస్’ మద్దతు…

పాత బిల్లు వీగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది . దక్షిణాది ప్రాంతీయ పార్టీల ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తూ కొత్తగా 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులోని రెండు ప్రధాన అంశాలు డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలను మెత్తబడేలా చేశాయి.

దామాషా నిష్పత్తికి రక్షణ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా 50 శాతం సీట్లను పెంచేలా కేంద్రం కొత్త ఫార్ములా తీసుకొచ్చింది. దీనివల్ల లోక్‌సభలో తమిళనాడుకున్న 7.18 శాతం వాటాకు ఎటువంటి ప్రమాదం లేకపోవడం, అలాగే లోక్ సభ సీట్లు 39 నుండి 59/60కి పెరుగడం డీఎంకే ‘యెస్’ తో మద్దతిచ్చింది. తెలంగాణ సీట్లు కూడా 17 నుండి 26కు పెరగనున్నాయి.

2051 వరకు ఫ్రీజ్ (25 ఏళ్ల గడువు): 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు అంటే 2051 వరకు మార్చకుండా రాజ్యాంగబద్ధంగా ఫ్రీజ్ చేయడానికి కేంద్రం ఒప్పుకుంది.

‘నో’ టూ ‘యెస్’ మధ్య వ్యూహం…

కేవలం బిల్లులో మార్పులు మాత్రమే కాకుండా, ఈ రెండు పార్టీల ‘యెస్’ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ముందుగా డీఎంకే విషయానికొస్తే..,డీలిమిటేషన్ విషయంలో తమ డిమాండ్లకు తలొగ్గేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చామని, తద్వారా తమిళనాడు రాష్ట్ర హక్కులను కాపాడగలిగామని ప్రచారం చేసుకునే అవకాశం డీఎంకే పార్టీకి లభించింది. అలాగే మరోవైపు తమ పార్టీకి హ్యాండ్ ఇచ్చి విజయ్ టీవీకే తో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీకి కూడా డీఎంకే పార్టీ తీసుకున్న నిర్ణయం రాహుల్ కు స్టాలిన్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే బిఆర్ఎస్ విషయానికొస్తే.., అధికార కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు ఈ డీలిమిటేషన్ బిల్లు బిఆర్ఎస్ కు ఒక సెంటిమెంట్ అస్త్రంగా కనిపించి ఉండవచ్చు. ఈ బిల్లుతో తెలంగాణలో లోక్ సభ సీట్ల సంఖ్య పెరగడంతో తెలంగాణ సెంటిమెంట్ ని మరింత బలపరుచుకోవచ్చు. అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో తన సత్తా చాటాలని ఆశపడుతున్న కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీకి ఇదొక సువర్ణ అవకాశం కావచ్చు.

తమ ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించినందున ఇది తమ విజయమని డీఎంకే, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నాయి. ప్రాంతీయ ప్రయోజనాల ముందు జాతీయ కూటమి లెక్కలు తలవంచక తప్పదని ఈ ‘నో టు యెస్’ రాజకీయం మరోసారి నిరూపించింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No More Repeats, Meenakshi Wants Action!

Meenakshi Chaudhary is looking beyond the roles she has played so far. After making an…

28 minutes ago

NTR Must Not Spare This Utter Humiliation!

NTR had been fairly vocal about social media and artificial intelligence morphs in the recent…

58 minutes ago