
మరో నాలుగైదు నెలల్లో “దేవర” విడుదలై రెండేళ్లు పూర్తికావస్తుంది. కానీ.. “దేవర 2” ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎన్టీఆర్ మాత్రం చాలా స్పష్టంగా, నమ్మకంగా “దేవర 2” ఉంటుంది అని అభిమానులకి మాటిచ్చాడు. అయితే కొన్నాళ్లు సైలెంట్ అయిన దేవర2 బజ్ కి మళ్లీ ఊపొచ్చింది.
రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఓ సినిమా ప్రారంభించింది, అందుకు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించి అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ప్రొడక్షన్ నెం.3 అని మెన్షన్ చేయడంతో ప్రొడక్షన్ నెం.2 ఏంటా? అని ఆలోచించగా “దేవర 2” అనే క్లారిటీ వచ్చింది అభిమానులకి. దాంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఇక్కడ అందరికంటే లక్కీ పర్సన్ కొరటాల శివ. “ఆచార్య” ఫ్లాప్ తర్వాత కొరటాలకి ఎన్టీఆర్ లాంటి హీరో దొరకడం మామూలు విషయం కాదు. అలాంటిది.. సినిమా యావరేజ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అది కేవలం ఎన్టీఆర్ స్టార్ డమ్ వల్లే అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.
అయితే.. కొరటాలకి ఎందుకో “దేవర” తర్వాత ఒక్క స్టార్ హీరో నుండి కూడా పిలుపు రాలేదు. ఒకానొక సందర్భంలో “దేవర 2” వస్తుందా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. కానీ.. ఇప్పుడు యువసుధ ఆర్ట్స్ లో ప్రొడక్షన్ నెం.2 “దేవర 2” అని క్లారిటీ రావడం, ఎన్టీఆర్ కూడా “దేవర 2” విషయంలో ఆసక్తిగానే ఉండడంతో కొరటాల నెత్తిన పాలు పోసినట్లుగా ఉంది. ఎప్పటికీ సెట్స్ కి వెళ్తుందో తెలియదు కానీ.. “దేవర 2” షూట్ గనుక స్టార్ట్ అయ్యిందంటే మాత్రం కొరటాల తన ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా తప్పులేదు.
#Sardar2: Silly, Over-the-Top First Half! First half sticks to the plot without any deviations but…
October marks the beginning of the US federal fiscal year. The reset may restore the…