
Vijayawada mayor race: caste or party ties?
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బెజవాడ మేయర్ సీట్ కోసం పట్టుబట్టిన జనసేన అందుకోసం టీడీపీ నుంచి వంగవీటి రాధ ను దిగుమతి చేసుకుంది. దీనితో కూటమి బెజవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధ పేరు దాదాపు ఖరారైనట్టే అంటున్నారు కూటమి శ్రేణులు.
అయితే కూటమి తరుపున ముఖ్యంగా టీడీపీ పార్టీ నుంచి బెజవాడ మేయర్ అభ్యర్థి స్థానం కోసం బాబు కు అనేక వినతులు వచ్చినప్పటికీ పొత్తు ధర్మానికి కట్టుబడి బాబు ఈ సీటు జనసేనకు కేటాయించడం, అందులో వంగవీటి రాధ విషయంలో ఇటు టీడీపీ లోను ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో విజయవాడలో కూటమి కథ సుకాంతం అయినట్టే కనిపిస్తుంది.
అయితే అనుకున్నట్టే కూటమి అభ్యర్థిగా కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధా బరిలోకి దిగితే ఆయనతో ఢీ కొట్టేందుకు వైసీపీ కమ్మ సామాజికవర్గమైన దేవినేని వారసుడు అవినాష్ ని రంగంలోకి దింపనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కొన్ని దశాబ్దాలు పాటు విజయవాడ రాజకీయాలు వంగవీటి vs దేవినేని అన్నట్టుగా సాగాయి. అదే సమయంలో ఈ రెండు కుటుంబాల ఉన్న రాజకీయ వైరాలు కాస్త రెండు సామాజికవర్గాల విద్వేషంగా కూడా మారిపోయింది.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఎప్పుడు కూడా ఒకే పార్టీ జెండా కింద పనిచేయలేవు. వంగవీటి కాంగ్రెస్ లో ఉంటే దేవినేని టీడీపీ లో ఉండేవారు. వంగవీటి కుటుంబానికి కాపు సామాజికవర్గం బలం ఉంటే దేవినేని కుటుంబానికి కమ్మ సామాజికవర్గ మద్దతు లభించేది.
ఇలా ఈ రెండు కుటుంబాల న్నుంచి వచ్చిన రాజకీయ వారసులుగా రాధా, అవినాష్ కూడా తమ తండ్రి రాజకీయ ఫార్ములానే నమ్ముకుని ఒకరు వైసీపీ లో ఉంటే మరొకరు టీడీపీ గూటిలో ఉంటున్నారు. ఇక ఇప్పుడు రాధా జనసేన లో చేరడంతో ఆయనకు తన సొంత సామాజికవర్గ బలం మరింత పెరిగినట్లయ్యింది.
ఆలాగే ఇన్నాళ్లు వంగవీటి రాధ టీడీపీ నేతగా చెలామణి అవ్వడంతో కమ్మ సామాజికవర్గం సైతం రాధ కి మద్దతు పలికింది. అటువంటి తరుణంలో ఇప్పుడు వంగవీటి రాధ కు ప్రత్యర్థి గా దేవినేని అవినాష్ బరిలోకి దిగితే దేవినేని కి సొంత సామాజికవర్గం కాపు కాస్తుందా.?
ఏపీ రాజకీయాలు ఇప్పటికి కుల చట్రం చుట్టే పరిభ్రమిస్తున్నాయి. అందునా విజయవాడలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అటువంటి తరుణంలో కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన వంగవీటి రాధ తన సామాజికవర్గ ఓట్లతో పాటుగా కమ్మ సామాజికవర్గ ఓట్లను కూడా పొందే అవకాసం ఉంది.
మరి విజయవాడ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే కమ్మ సామాజికవర్గ ఓట్లు కూటమి అధినేత బాబు ని కాదని జగన్ బలపరిచిన కమ్మ సామాజికవర్గ నేత, దేవినేని బ్రాండ్ కి అండగా నిలిచే అవకాశం ఉంటుందా.? పార్టీని పక్కన పెట్టి కులానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా.?
లేని పక్షంలో ఇటు కాపు దూరమై, అటు కమ్మ పక్కన పెడితే విజయవాడ రాజకీయాలలో దేవినేని అవినాష్ రాజకీయానికి ఆస్కారం ఉంటుందా.? జగన్ వ్యూహానికి ఫలితం వస్తుందా.? దేవినేని అవినాష్ కి కులం కవచం అవుతుందా.? లేదా పార్టీ బల్లెం గా మారుతుందా.?
వంగవీటి vs దేవినేని…కాపు vs కమ్మ అన్న జగన్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఇక్కడ సరితూగుతాయా.? అనేది మరికొన్ని రోజులలో తేలనుంది.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…