
“ముందుగా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా చేసారు కాబట్టి మరొకరిని ఊహించుకోవడానికి లేకుండా పోయింది గానీ, ఇది జనాలతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం కాబట్టి, ఆ విషయంలో నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అయితే బాగా చేయగలరని తాను భావిస్తున్నానని, ఒకవేళ అదే ఎప్పుడైనా జరిగితే, గోడ దూకైనా లోనికి వెళ్లి ఓ రెండు రోజులు గడిపి వస్తానని” అన్నారు. అయితే సాధారణంగా ‘బిగ్ బాస్’ షోను ఎవరైనా ఒకరు హోస్ట్ చేస్తే వాళ్ళే కొనసాగుతారు తప్ప మరొకరు రారని, మొదట్లో ఒకరు చేంజ్ అయిన తర్వాత వచ్చిన సల్మాన్ ఖానే ఇప్పటికీ హోస్ట్ చేస్తున్నారని, కాబట్టి తారకే కొనసాగుతారన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అయితే అసలు ‘బిగ్ బాస్’ షోను పవన్ కళ్యాణ్ హోస్ట్ చేయడం అనేది ఊహలకే అందని విషయం. మామూలుగానే రెండు మాటలు మాట్లాడడానికి సంకోచించే పవన్, ఇలాంటి ‘ఎంటర్టైన్మెంట్’ కార్యక్రమాలకు అస్సలు సూట్ కారన్న విషయం బహుశా అభిమానులు సైతం అంగీకరించే విషయమే. ప్రజల సామాజిక సమస్యలపై కాస్త ఎక్కువగా మాట్లాడగలరేమో గానీ, ఇలా ప్రేక్షకులను ఉత్సాహపరిచే విధంగా రియాలిటీ షోలను పవన్ కళ్యాణ్ చేయలేడని స్పష్టంగా చెప్పవచ్చు. మరి ధనాధన్ ధన్ రాజ్ చెప్పిందంతా ఏంటంటే… ‘జబర్దస్త్’ భాషలోనే చెప్పాలంటే… ‘బిస్కెట్’ వేసాడురోయ్… అనాలి!
Tamil Nadu Chief Minister Vijay's son Jason Sanjay's debut directorial film Sigma starring Sundeep Kishan…
Keerthy Suresh steps into this photo gallery with pure star poise and a fashion game…