
బెయిల్‌పై బయటకు వస్తున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు స్వాగతం… సుస్వాగతం. కూటమి ప్రభుత్వం, సిట్ అధికారులు ఎంత బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా అంతుచిక్కని ఓ గొప్ప మద్యం కుంభకోణం చేసిన ఘనులు మీరు.
మీ వంటి గొప్ప మేధావుల పాదధూళితో పునీతమైన విజయవాడ జైలుకి, అండమాన్ నికోబార్‌లో స్వాతంత్ర్య సమరయోధులను బందించిన సెల్యులర్ జైలుతో సమాన హోదా కల్పించారు.
మీరు మావాళ్ళు… కనుక మీరు బెయిల్‌పై బయటకు వస్తుంటే గజమాలలతో స్వాగతం పలకాల్సిన ఈ తరుణంలో మీకోసం జైలు బయట ఇలా పడిగాపులు కాయాల్సిరావడం, ఇలా ధర్నా చేయాల్సిరావడం మాకు ఎంత బాధాకరమో ఆ చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు?
ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేస్తే ఆదివారం ఉదయం 10.55 గంటల వరకు విడుదల చేయకపోవడాన్ని ఏమనుకోవాలి?
ఈ కుంభకోణంతో మీకేమి సంబంధం ఉందని ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసిందో మాకు తెలీదు. కానీ మీరు ముగ్గురూ మావాళ్ళు!
అందుకే మీ కోసం ఉదయం నుంచి అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, అప్పిరెడ్డి, మల్లాది విష్ణు జైలు బయట పడిగాపులు కాస్తున్నారు. మీకు స్వాగతం చెప్పి తాడేపల్లి ప్యాలస్ తోడ్కొని పోయేందుకు ఎదురు చూస్తున్నారు.
కానీ మీ బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు మళ్ళీ హౌస్ మోషన్ లేదా మరేదో మోషన్ పిటిషన్ వేయబోతున్నారట!
అప్పుడూ వైసీపీయే లాయర్లని పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఎందుకంటే, మీరు మావాళ్ళు కనుక. ఈ కేసులో మీరు లోపల ఉంటే ఈ కుంభకోణం రహస్యాలన్నీ బయటపెట్టేసి మమ్మల్నీ లోపలకు ఈడ్చుకుపోతారని మాత్రం కానే కాదు. కేవలం మీరు మావాళ్ళనే అభిమానంతోనే మిమ్మల్ని కాపాడుకుంటున్నాము. లోకం ఏమనుకున్నా మాకు అనవసరం!
మీరు ముగ్గురు బెయిల్‌పై బయటకు రావడంతో చివరికి న్యాయం, ధర్మమే గెలిచాయని తేలిపోయింది. కానీ న్యాయం, ధర్మం గెలిపించుకోవడానికి వైసీపీ ఇంకా చాలా పోరాటాలు చేయక తప్పదు.
The cockroach janta party movement has reached a significant position in the social ladder as…
Srushti Bannatti is bringing a punchy pop of lime green to the fashion frame, and…